1. ఎవరు ఆదాముకు మాంసములో మాంసమాయెను?
2. తన కుమారుడు వేటాడిన మాంసమును ఇష్టపడినది ఎవరు?
3. యాకోబుతో ఎవరు నీవు నా మాంసమువై యున్నావనెను?
4. యోబు యొక్క ఎముకలు దేనితో కలిసి మాంసముతో అంటుకొనెను?
5. లోయలో ఉన్న ఎండిన ఎముకలకు దేవుడు చర్మము కప్పి, మాంసము పొదిగి ఏమి వాటిలో యుంచెను?
6. క్రీస్తు యొక్క మాంసమును, చర్మమును ఎవరు క్షీణింపజేసెను?
7. యెజ్రేయేలు భూభాగమందు ఏవి యెజెబెలు మాంసమును తినెను?
8. దేవుని గొప్పవిందుకు అందరి మాంసమును తినుటకు ఎక్కడ ఎగురుచున్న పక్షులను దూత పిలిచెను?
9. బెన్ హిన్నోము లోయలో ఎవరి రక్తము చిందించిన వారిని దేవుడు, వారి కుమారుల, కుమార్తెల మాంసమును తినునట్లు చేసెను?
10. ఇశ్రాయేలీయుల పర్వతముల మీద జరుగు బలిలో ఎవరి మాంసము తినుటకు దేవుడు సకల జాతి పక్షులను,భూమృగములను కూడి రమ్మనెను?
11. గుర్రము మీద కూర్చున్న వానితో యుద్ధము చేసి మిగిలిన ఎవరెవరి మాంసము పక్షులు కడుపారా తినిరి?
12. శత్రువుల భయమును బట్టి ఇబ్బందిని బట్టి నిరపరాధుల రక్తము చిందించిన వారు ఎవరి మాంసము తిందురు?
13. ఐగుప్తు రాజైన ఫరో మాంసమును ఎక్కడ పడవేతునని యెహోవా సెలవిచ్చెను?
14. రాజులు వేశ్యయైన ఎవరి మాంసమును భక్షించి దానిని బొత్తిగా అగ్నితో కాల్చివేతురు?
15. యెహోవా యొక్క ఉగ్రత దినమున పాపము చేసిన జనుల మాంసము ఎలా పారవేయబడును?
Result: