Telugu Bible Quiz Topic wise: 611 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మాట్లాడుట" అనే అంశము పై క్విజ్ )

1. కయీను తన తమ్ముడైన హేబెలుతో ఎక్కడ "మాట్లాడెను"?
ⓐ పొలములో
ⓑ గుడారములో
ⓒ యి౦టిలో
ⓓ తోవలో
2. అబ్రాహాము సాగిలపడినపుడు ఎవరు అతనితో "మాట్లాడెను"?
ⓐ దేవుడు
ⓑ దూత
ⓒ రాజు
ⓓ హేతుకుమారులు
3. ఎవరు తన అన్నదమ్ములతో, మీతో "మాట్లాడుచున్నది" నా నోరే అని అనెను?
ⓐ రూబేను
ⓑ యూదా
ⓒ యోసేపు
ⓓ దావీదు
4. బాగుగా "మాట్లాడగలడు", అని యెహోవా ఎవరిని గూర్చి అనెను?
ⓐ యెహొషువా
ⓑ ఎఫ్రాయీము
ⓒ హూరు
ⓓ అహరోను
5. దావీదుతో ఎలా మాట్లాడమని సౌలు తన సేవకులతో చెప్పెను?
ⓐ బిగ్గరగా
ⓑ రహస్యముగా
ⓒ ఎదురుగా
ⓓ చాటుగా
6. మోషే "మాటలాడుచుండగా" దేవుడు దేని చేత ఉత్తరమిచ్చుచుండెను?
ⓐ నోటితో
ⓑ గొంతుకతో
ⓒ తన కంఠస్వరముతో
ⓓ తన ఊపిరితో
7. యేసు రూపాంతరము చెందినపుడు ఎవరు మనమిక్కడ ఉండుట మంచిదని "మాట్లాడెను"?
ⓐ యోహాను
ⓑ యాకోబు
ⓒ అంద్రెయ
ⓓ పేతురు
8. యేసు సమరయ స్త్రీతో "మాట్లాడుట" చూచిన ఎవరు ఆశ్చర్యపడిరి?
ⓐ శిష్యులు
ⓑ శాస్త్రులు
ⓒ పరిసయ్యులు
ⓓ సమరయులు
9. ఎవరు భూసంబంధమైన సంగతులను గూర్చి "మాట్లాడును"?
ⓐ లోకులు
ⓑ భూసంబంధులు
ⓒ మనుష్యులు
ⓓ అన్యులు
10. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు భయపడక "మాటలాడుము"అని ఎవరితో చెప్పెను?
ⓐ అపొల్లో
ⓑ మార్కు
ⓒ సీల
ⓓ పౌలు
11. దేవుడు తన ప్రజలతో ఎప్పుడు లేచి "మాట్లాడుచుండెను"?
ⓐ రేయిజామున
ⓑ ఒకగడియలో
ⓒ పెందలకడ
ⓓ ఉదయమున
12. ప్రతి మనుష్యుడు "మాటలాడుటకు" ఏమై యుండవలెను?
ⓐ కంగారుపడవలెను
ⓑ తొందరపడవలెను
ⓒ వేగిరపడవలెను
ⓓ నిదానించవలెను
13. నోరులేని గార్ధభము మానవస్వరముతో "మాటలాడి" ఏ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను?
ⓐ బిలాము
ⓑ యొహు
ⓒ నోవద్యా
ⓓ సిద్కియా
14. అబద్ధమాడుటమాని ప్రతివాడు ఎవరితో సత్యమే "మాటలాడ"వలెను?
ⓐ తన ఇంటివారితో
ⓑ తన స్నేహితులతో
ⓒ తన పొరుగువానితో
ⓓ తన తోటివారితో
15. బుద్ధిమంతులతో "మాటలాడినట్టుగా" పౌలు ఏ సంఘముతో మాటలాడుచుండెను?
ⓐ ఫిలిప్పీ
ⓑ కొలస్సీ
ⓒ ఎఫెసీ
ⓓ కొరింథీ
Result: