Telugu Bible Quiz Topic wise: 614 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మార్గము" అనే అంశము పై క్విజ్ )

1. ఎవరు మనకు మార్గమై యున్నారు?
ⓐ యేసుక్రీస్తు
ⓑ తల్లి
ⓒ తండ్రి
ⓓ పెద్దలు
2. యెహోవా తన మార్గమును ఏమి చేయును?
ⓐ చూపును
ⓑ చెప్పును
ⓒ బోధించును
ⓓ నడుపును
3. యెహోవా మాట వినిన యెడల ఎవరి మార్గమందు నడుచుకొందుము?
ⓐ సజ్జనుల
ⓑ మనుష్యుల
ⓒ పెద్దల
ⓓ సేవకుల
4. యెహోవా సరాళ మార్గమున మనలను ఏమి చేయును?
ⓐ ప౦పును
ⓑ నడుపును
ⓒ దించును
ⓓ తీసుకెళ్ళును
5. యెహోవా ఎవరి మార్గము నుండి మనలను తప్పించును?
ⓐ లోకస్థుల
ⓑ చెడ్డవారి
ⓒ దుష్టుల
ⓓ అపనమ్మకస్థుల
6. దుష్టుల మార్గము ఎక్కడికి నడుపును?
ⓐ వ్యసనమునకు
ⓑ నాశనమునకు
ⓒ చెడ్డవాటికి
ⓓ లోభత్వమునకు
7. ఎవరి మార్గము యెహోవాకు తెలియును?
ⓐ నీతిమంతుల
ⓑ పాపుల
ⓒ దుష్టుల
ⓓ దొంగల
8. మేలు కలుగు మార్గమేది;అని ఏమి చేయాలి?
ⓐ వెదకాలి
ⓑ చూడాలి
ⓒ అడగాలి
ⓓ చెప్పాలి
9. తప్పు మార్గములను ఏమి చేయాలి?
ⓐ వదలాలి
ⓑ విడవాలి
ⓒ త్రోయాలి
ⓓ అసహ్యించుకోవాలి
10. ఎటువంటి మార్గములను గూర్చి విచారించాలి?
ⓐ నవీన
ⓑ మంచి
ⓒ పురాతన
ⓓ కొత్త
11. మన మార్గములను యెహోవాకు అప్పగించినపుడు ఏమి నెరవేరును?
ⓐ కోరికలు
ⓑ వాంఛలు
ⓒ యిచ్ఛలు
ⓓ కార్యముల
12. భూమి మీద ఎవరు తమ మార్గములను చెరిపివేసుకొనెను?
ⓐ మానవులు
ⓑ సమస్తశరీరులు
ⓒ రాజుల
ⓓ చక్రవర్తులు
13. మన దేవుడైన యెహోవా మనలను నడిపించిన మార్గములను ఏమి చేసుకోవాలి?
ⓐ మననము
ⓑ గుర్తు
ⓒ తలపు
ⓓ జ్ఞాపకము
14. యెహోవా తన మార్గములను ఎక్కడ బోధించును?
ⓐ సమాజములో
ⓑ యెహోవాపర్వతముపై
ⓒ మందిరములో
ⓓ హృదయములో
15. యెహోవా మార్గములను అనుసరించిన యెడల ఎలా ఆయన మనలను హెచ్చించును?
ⓐ ఆకాశముపైకి
ⓑ ఉన్నతముగా
ⓒ ఆనందముగా
ⓓ స్వతంత్రించుకొనునట్లు
Result: