1. నీ సంతతి వారు దాసులైన దేశము నుండి "మిక్కిలి"ఆస్తితో బయలుదేరి వచ్చెదరని యెహోవా ఎవరితో అనెను?
2. ఏశావు ఎంతమందితో తనను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడని విని యాకోబు "మిక్కిలి"భయపడెను?
3. ఐగుప్తు దేశపు రాజుకు వచ్చిన కల భావము చెప్పుచు కరవు "మిక్కిలి"భారముగా నుండునని ఎవరు అనెను?
4. యెహోవా ఎవరికి మేలు చేయగా ఆ జనము విస్తరించి "మిక్కిలి" ప్రబలెను?
5. ఎవరు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని "మిక్కిలి" గొప్పవాడాయెను?
6. ఎవరు తమ వెనుక వచ్చుట చూచిన ఇశ్రాయేలీయులు "మిక్కిలి"భయపడిరి?
7. యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఇశ్రాయేలీయులు "మిక్కిలి " తగ్గిపోదురని, వారి మధ్య నున్న ఎవరు "మిక్కిలి "హెచ్చగునని యెహోవా అనెను?
8. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినప్పుడు అది"మిక్కిలి "ఏమాయెను?
9. తాను చూచిన రూపము "మిక్కిలి"భీకరముగా ఉండెనని ఎవరి భార్య అతనితో అనెను?
10. యెహోవాను విసర్జించిన ఇశ్రాయేలీయులకు యెహోవా ఏమాయెను గనుక వారికి "మిక్కిలి" యిబ్బంది కలిగెను?
11. ఇశ్రాయేలీయులందరు ఏ మనుష్యుని చూచి "మిక్కిలి"భయపడి పారిపోయిరి?
12. ఎవరి కుమారులు యెహోవాను ఎరుగని వారై "మిక్కిలి"దుర్మార్గులై యుండిరి?
13. ఇశ్రాయేలీయులకు "మిక్కిలి" శ్రమ కలుగగా, నీ సన్నిధిని పాపము చేసి నిన్ను విడిచి దేనిని పూజించియున్నామని వారు యెహోవాకు మొర్రపెట్టిరి?
14. ఏది "మిక్కిలి "ఎర్రబడి త్రాగుటకు రుచిగా నుండగా దాని వైపు చూడకూడదు?
15. అమాలేయులు దండెత్తి సమస్తము తీసుకొని పోగా ఎవరు "మిక్కిలి దు:ఖపడెను?
Result: