① "Friend" అనగా అర్ధము ఏమిటి?
② తన "స్నేహితుల"కొరకు ఏమి పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడని యేసు అనెను?
③ ఎవరి కంటెను ఎక్కువగా హత్తియుండు "స్నేహితుడు"కలడు?
④ తన చుట్టములందరికి అసహ్యుడైన ఎవనికి "స్నేహితులు"మరి దూరస్థులగుదురు?
⑤ నా "స్నేహితులు" మాయమై పోవు దేని వలె నమ్మకూడని వారైరి అని యోబు అనెను?
⑥ కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు ఏమి మానుకొనినను "స్నేహితుడు"దయచూపతగును?
⑦ బహుమంది "చెలికాండ్రు"గలవాడు ఏమగును?
⑧ ఒకని యొక్క ఏమి యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను వానికి "మిత్రులుగా"చేయును?
⑨. జరిగిన సంగతి ఎప్పుడు ఎత్తువాడు "మిత్ర"భేదము చేయును?
①⓪ "చెలికాని " హృదయములో నుండి వచ్చు ఎటువంటి మాటలు హృదయమును సంతోషపరచును?
①①. చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని యేసు ఎవరితో అనెను?
①②. ఎవరి ఖడ్గము శత్రువుల మీద విజయము నిచ్చునను తాత్పర్యము కలిగిన కలను కనినవాడు దాని తన"చెలికానితో"చెప్పెను?
①③. తన "చెలికాడు"తనను దూషించెనని ఎవరు అనెను?
①④ ఒకనికొకడు శత్రువులై యుండిన ఎవరెవరు యేసును పట్టుకొనిన దినమున "మిత్రులైరి'?
①⑤ స్త్రీలు ఎవరిని చూచి నీ ప్రియ"స్నేహితులు" నిన్ను మోసపుచ్చి నీపై విజయము పొందియున్నారని యందురని యిర్మీయా అతనితో అనెను?
Result: