Telugu Bible Quiz Topic wise: 619 || తెలుగు బైబుల్ క్విజ్ ( "ముండ్లు" అనే అంశము పై క్విజ్ )

1. ఇశ్రాయేలీయులు కనాను దేశనివాసులను తమ యెదుట నుండి వెళ్లగొట్టని యెడల వారు వీరి యొక్క దేనిలో "ముండ్లు"గా నుందురని యెహోవా చెప్పెను?
ⓐ శరీరములో
ⓑ తలలో
ⓒ ప్రక్కలలో
ⓓ కన్నులలో
2. యెహోవాను విసర్జించిన జనులు ఏమి చల్లి "ముండ్ల పంట"కోయుదురు?
ⓐ గోధుమలు
ⓑ యవలు
ⓒ ఆవాలు
ⓓ జొన్నలు
3. ఎవరు లయము సంభవించి వెళ్లిపోగా వారి నివాసస్థలములో "ముండ్ల కంప"పెరుగును?
ⓐ బెన్యామీనీయులు
ⓑ మోయాబీయులు
ⓒ ఎఫ్రాయిమీయులు
ⓓ రేకాబీయులు
4. యెహోవా ఎవరిని "ముండ్ల తుప్పలలో"తిరుగుచున్నావని అనెను?
ⓐ యెహెజ్కేలును
ⓑ యిర్మీయాను
ⓒ ఆమోసును
ⓓ జెఫన్యాను
5. ఎవరి మార్గము "ముండ్ల కంచె"?
ⓐ వదరుబోతు
ⓑ మూర్ఖుని
ⓒ సోమరి
ⓓ మూడుని
6. ఒకడు "ముండ్లను"చేత పట్టుకొనుటకు భయపడినట్లు ఎవరు విసర్జింపబడుదురు?
ⓐ దుష్టులు
ⓑ పాపులు
ⓒ దుర్మార్గులు
ⓓ ద్రోహులు
7. వ్యభిచరించిన దేశము యొక్క వేటికి యెహోవా "ముండ్ల కంచె"అడ్డము వేయుదుననెను?
ⓐ ప్రాకారములకు
ⓑ పట్టణములకు
ⓒ వీధులకు
ⓓ మార్గములకు
8. "ముండ్లు" ఎవరి మార్గములో కలవు?
ⓐ సోమరుల
ⓑ బుద్దిహీనుల
ⓒ మూర్ఖుల
ⓓ మూఢుల
9 . ఎవరు "ముండ్లు"కాల్చిన మంట ఆరిపోవునట్లు నశించిరి?
ⓐ పనికిమాలినవారు
ⓑ దుష్ట సంఘము
ⓒ శత్రువులు
ⓓ పాపహితులు
10 . ఏమి లేనివాని ద్రాక్షాతోటలో "ముండ్ల తుప్పలు"బలిసియుండెను?
ⓐ జ్ఞానము
ⓑ వివేకము
ⓒ బుద్ధి
ⓓ తెలివి
11. ఇశ్రాయేలు వారి పాపస్వరూపమైన ఎక్కడ బలిపీఠము మీద "ముండ్లచెట్లు"ను పెరుగును?
ⓐ ఆవెనులో
ⓑ బేతేలులో
ⓒ గిలాదులో
ⓓ రామాలో
12. దేశములో ఎవరు "ముండ్ల చెట్టు" వంటివారుగా ఉన్నారు?
ⓐ మంచివారు
ⓑ దొంగలు
ⓒ యధార్ధులు
ⓓ ద్రోహులు
13. " ముండ్ల పొదలలో వేటిని కోయుదురా? అని యేసు అడిగెను?
ⓐ అంజూరపు పండ్లు
ⓑ ఒలీవ పండ్లు
ⓒ ద్రాక్షా పండ్లు
ⓓ నేరేడు పండ్లు
14. దేని మీద "ముండ్ల తుప్పలు"పెరిగిన యెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందును?
ⓐ కొండ ప
ⓑ పర్వతము
ⓒ గుట్ట
ⓓ భూమి
15. దేశములో ఎవరు "ముండ్ల కంచె" కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు?
ⓐ కాపరులు
ⓑ ఏలికలు
ⓒ యదార్ధవంతులు
ⓓ గొప్పవారు
Result: