Telugu Bible Quiz Topic wise: 620 || తెలుగు బైబుల్ క్విజ్ ( "ముందుగా" అనే అంశము పై క్విజ్ )

①. సొదొమ గొమొర్రాల నాశనము గూర్చి యెహోవా ఎవరికి ముందుగా తెలిపెను?
Ⓐ నోవహుకు
Ⓑ అబ్రాహాముకు
Ⓒ లోతుకు
Ⓓ అబీమెలెకుకు
②. ఎవరి తల్లిదండ్రులు సహోదరులు అతనికి సాష్టాంగపడుదురని ముందుగా యెహోవా కల ద్వారా చూపించెను?
Ⓐ యాకోబుకు
Ⓑ షిమ్యోనుకు
Ⓒ యోసేపుకు
Ⓓ బెన్యామీనుకు
③. కనాను దేశపు పరిస్థితులను యెహోవా ఎవరి ద్వారా ముందుగా ఇశ్రాయేలీయులకు వివరింపజేసెను?
Ⓐ మోషే
Ⓑ యోహోషువ
Ⓒ అహరోను
Ⓓ యిత్రొ
④. ఏలీ యొక్క యింటివారికి రాబోవు శిక్ష గురించి ముందుగా యెహోవాఎవరికి తెలియపరచెను?
Ⓐ ఏలీకి
Ⓑ హన్నాకు
Ⓒ దైవజనునికి
Ⓓ సమూయేలుకు
⑤. దావీదు చేసిన పాపము వలన రాబోవు సంగతులను గూర్చి యెహోవా ఎవరి ద్వారా అతనికి ముందుగా తెలియజేసెను?
Ⓐ గాదు
Ⓑ అహీయా
Ⓒ నాతాను
Ⓓ హనన్యా
⑥. ఆహాబు కుటుంబికులకు సంభవింపబోవు దానిని యెహోవా ముందుగా ఎవరి ద్వారా అతనికి తెలిపెను?
Ⓐ ఎలీషా
Ⓑ ఏలీయా
Ⓒ యోహు
Ⓓ హనానీ
⑦. క్రీస్తు కన్యక ద్వారా జన్మించునని యెషయా ఏ రాజుకు ముందుగా ప్రవచనము చెప్పెను?
Ⓐ ఆహాజుకు
Ⓑ హిజ్కియాకు
Ⓒ యోతాముకు
Ⓓ ఉజ్జీయాకు
⑧. గర్భములో రూపింపక మునుపే ఎరిగి ముందుగా యెహోవా ఎవరిని ప్రతిష్టించెను?
Ⓐ యాకోబును
Ⓑ యిర్మీయాను
Ⓒ యెహెజ్కేలును
Ⓓ యోవేలును
⑨. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము ముందుగా చూచినదెవరు?
Ⓐ జెకర్యా
Ⓑ ఆమోసు
Ⓒ యెహెజ్కేలు
Ⓓ మలాకీ
①⓪. ఎవరికి సంభవింపబోవు దానిని అతనికే యెహోవా కల ద్వారా ముందుగా తెలిపెను?
Ⓐ దర్యావేషుకు
Ⓑ బెల్షస్సరుకు
Ⓒ నెబుకద్నెజరుకు
Ⓓ అహష్వేరోషుకు
①①. ఇజ్రాయేను ఏలబోవువాడు దేని నుండి వచ్చునని మీకా ముందుగా ప్రవచించెను?
ⓐ నజరేతు నుండి
Ⓑ బెత్లహేము ఎఫ్రాతానుండి
Ⓒ సమరియ నుండి
Ⓓ యెరూషలేము నుండి
①②. ఎవరిని తన ప్రజల మీదికి రేపుచున్నానని ముందుగాయెహోవా హబక్కూకుకు తెలిపెను?
Ⓐ కల్దీయులను
Ⓑ అష్షూరీయులను
Ⓒ ఐగుప్తీయులను
Ⓓ ఫిలిష్తీయులను
①③. ఫిలిష్తీయుల పట్టణ నాశనము గురించి ముందుగా ఎవరు ప్రవచించెను?
Ⓐ మలాకీ
Ⓑ జెఫన్యా
Ⓒ హగ్గయి
Ⓓ జెకర్యా
①④. యెహోవా యొక్క కడవరి మందిరము యొక్క మహిమను గూర్చి ముందుగా చెప్పినదెవరు?
Ⓐ యెహెజ్కేలు
Ⓑ జెకర్యా
Ⓒ హగ్గయి
Ⓓ హోషేయా
①⑤. యెహోవా యెరూషలేము మీద చేయు యుద్ధము గురించి ముందుగా ఎవరు ప్రవచించెను?
Ⓐ మలాకీ
Ⓑ యోవేలు
Ⓒ మీకా
Ⓓ జెకర్యా
Result: