1. ఎవరు ఆకాశము తట్టు తమ "ముఖము" ఎత్తుదురని ఆసాపు అనెను?
2. లయకర్త వచ్చినప్పుడు జనుల"ముఖములు"తెల్లబోవుచున్నవని ఎవరు అనెను?
3. యెహోవా దినమున వచ్చు బలమైన యొక గొప్పసమూహమును చూచి జనముల "ముఖములు"తెల్లబారునని ఎవరు అనెను?
4. నీ "ముఖము "దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుమని యెహోవా ఎవరితో అనెను?
5. అన్యజనులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియుండగా మా "ముఖములు"తెల్లబారుచున్నవని ఎవరు అనెను?
6. దేనిలోని జనులు రాతికంటే తమ "ముఖములను"కఠినముగా చేసికొనియున్నారు?
7. ఎవరి "ముఖములను"నూరి మీరేమి చేయుదురని ?యెహోవా తనజనుల పెద్దలు మరియు వారి యధిపతులతో అనెను?
8. యెహోవా దినమున జనముల "ముఖములు" దేని వలె ఎర్రబారును?
9. నీకేమి కావలయును అని ఎవరు తమ "ముఖములను"త్రిప్పుకొని మీకాను అడిగిరి?
10. ఎవరిలో పరాక్రమవంతులు సింహముఖము వంటి "ముఖములు గలవారు?
11. ఎవరు మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు నేలకు "ముఖములు" వంచుకొని యెహోవాకు నమస్కరించిరి ?
12. యెహోవా ఆలయద్వారము దగ్గర ఇరువది యయిదుగురి మనుష్యుల "ముఖములు"ఏ తట్టు తిరిగియుండెను?
13. గోడమీద ఒక హస్తము వ్రాయుట చూచిన ఏ రాజు "ముఖము"వికారమాయెను?
14. మన పితరులు యెహోవా నివాసమునకు పెడ"ముఖము"పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరని ఎవరు లేవీయులతో అనెను?
15. నీ "ముఖము"ఏమని ప్రియుడైన క్రీస్తు సంఘముతో అనెను?
Result: