1. యాకోబు రాహేలును "ముద్దు"పెట్టుకొని ఎలా ఏడ్చెను?
2. ఎవరు యాకోబును ఎదుర్కొని అతని మెడమీద పడి "ముద్దు"పెట్టుకొనెను?
3. ఎవరు తన సహోదరులందరిని "ముద్దు"పెట్టుకొనెను?
4. దేవుని పర్వతమందు మోషే ఎవరిని కలిసికొని "ముద్దు"పెట్టుకొనెను?
5. మోషే తన మామను ఎదుర్కొనపోయి ఏమి చేసి అతని "ముద్దు"పెట్టుకొనెను?
6. ఎవరు తన అత్తను "ముద్దు"పెట్టుకొనెను?
7. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని ఎవరి తల మీదపోసి అతని "ముద్దు"పెట్టుకొనెను?
8. దావీదు ఎవరికి సాష్టాంగ నమస్కారము చేసి అతని "ముద్దు"పెట్టుకొనెను?
9 . ఏమి లేని పడుచువానిని పట్టుకొని కపటము గల స్త్రీ ""ముద్దు"పెట్టుకొనెను?
10 . సరియైన మాటలతో ఏమి ఇచ్చుట పెదవులతో "ముద్దు"పెట్టుకొనినట్లుండును?
11. ఎవడు లెక్కలేని "ముద్దులు"పెట్టును?
12. బయలునకు నోటితో "ముద్దు"పెట్టుకొనకయు యుండు ఎంత మంది నాకు మిగిలియున్నారని యెహోవా ఏలీయాతో అనెను?
13. సూర్యచంద్రుల తట్టు చూచి నా నోరు "ముద్దు"పెట్టిన యెడలను దేవుని దృష్టికి నేను ఏమవుదునని యోబు అనెను?
14. కుమారుని "ముద్దు"పెట్టుకొనక పోయిన యెడల ఆయన ఏమి చేయును?
15.ఎటువంటి "ముద్దు"పెట్టుకొని యొకని కొకడు వందనము చేసుకొనవలెను?
Result: