1. మకరము యొక్క ఏవి ఎవరును తీయలేని "ముద్ర"చేత సంతన చేయబడియున్నవని యెహోవా అనెను?
2. తన తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన ఎవరి పొలమును యిర్మీయా కొని క్రయపత్రము వ్రాసి "ముద్ర"వేసెను?
3. "ముద్ర"గల "ముద్ర"లేని విడుదల యైన వేటిని యిర్మీయా తీసుకొనెను?
4. "ముద్ర"గల "ముద్ర"లేని క్రయపత్రమును బహుదినములుండునట్లు మట్టికుండలో దాచిపెట్టమని యిర్మీయా ఎవరికి ఆజ్ఞాపించెను?
5. ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని "ముద్రతో" ముద్రించి నాబోతు ఉన్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపినదెవరు?
6. నెహెమ్యాయు జనులు చేసుకొనిన ఒక స్థిరమైన నిబంధనకు "ముద్రలు"వేసినదెవరు?
7. ఎవరు యూదులను హతము చేయుటకు తాకీదులు వ్రాయించగా రాజు ఉంగరము చేత అది "ముద్రించ"బడెను?
8. నా యొక్క ఏమి సంచిలో "ముద్రింప" బడియున్నదని యోబు అనెను?
9. ఎవరి గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో యని ప్రధానులు అధిపతులు రాజు"ముద్రను "గుహకు వేసి ముద్రించిరి?
10.దానియేలుకు చెప్పబడిన సంగతులు ఎప్పటి వరకు మరుగుగా ఉండునట్లు "ముద్రింప"బడెను?
11. ముకలుగజేయు దేనిని ఇచ్చుటకు దేవుడు క్రీస్తుకు "ముద్ర"వేసి యుండెనని యేసు చెప్పెను?
12. దేవుడు మనకు "ముద్ర"వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను దేనిని అనుగ్రహించియుండెను?
13. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత"ముద్రింప"బడితిరని పౌలు ఏ సంఘముతో అనెను?
14. దేని వరకు దేవుని యందు "ముద్రింప"బడియున్నాము?
15. రాజు ఉంగరముతో "ముద్రింప"బడిన తాకీదును ఎవరు మార్చజాలడు?
Result: