Telugu Bible Quiz Topic wise: 624 || తెలుగు బైబుల్ క్విజ్ ( "ముప్పది" అనే అంశము పై క్విజ్ )

1. ఎవరు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు "ముప్పది"సంవత్సరముల వాడై యుండెను?
ⓐ యోసేపు
ⓑ మోషే
ⓒ అహరోను
ⓓ రూబేను
2. ఎవరు "ముప్పది"ఏండ్ల వాడై యేలనారంభించెను?
ⓐ సొలొమోను
ⓑ సౌలు
ⓒ రెహబాము
ⓓ హిజ్కియా
3. ముప్పదియవ సంవత్సరమున ఎవరు కెబారు నదీప్రదేశమున చెరలో నున్న వారి మధ్య కాపురముండెను?
ⓐ యిర్మీయా
ⓑ జెకర్యా
ⓒ యెహెజ్కేలు
ⓓ నెహెమ్యా
4. దావీదు దగ్గర యున్న " ముప్పది" మంది బలాఢ్యులలో ఎవరు బావిలో దాగియున్న సింహమును చంపివేసెను?
ⓐ అబీ
ⓑ ఆశాహేలు
ⓒ ఊరీయా
ⓓ బెనాయా
5. యెహోవా మందిరము నందు యున్న ఉపకరణములలో "ముప్పది"పళ్లెములు దేనితో చేయబడినవి యుండెను?
ⓐ వెండి
ⓑ ఇత్తడి
ⓒ బంగారము
ⓓ రాగి
6. గిలాదు వంశస్థుడైన ఎవరికి "ముప్పది" మంది కుమారులుండిరి?
ⓐ తోలా
ⓑ యాయీరు
ⓒ ఇశ్శఖారు
ⓓ పువ్వా
7. ఇశ్రాయేలీయుల అధిపతి యైన ఎవరికి "ముప్పది" మంది కుమారులు, "ముప్పది" మంది కుమార్తెలు ఉండిరి?
ⓐ ఇబ్సాను
ⓑ ఇమ్మోను
ⓒ ఇష్బోకు
ⓓ ఇరీయా
8. యాకోబు తన అన్న ఏశావు కొరకు ఏర్పర్చిన కానుకలో "ముప్పది" ఏమి కలవు?
ⓐ పాడి ఆవులు
ⓑ పాడిఒంటెలు
ⓒ పాడి గొర్రెలు
ⓓ పాడిమేకలు
9. సమ్సోను ఎక్కడికి పోయి "ముప్పది" మందిని చంపెను?
ⓐ గాజా
ⓑ తిమ్నా
ⓒ అష్కెలోను
ⓓ రామత్లహి
10. యెహోవా ఆలయములోని మేడగదులలో మూడేసి ఏమి యుండి "ముప్పది"గదులుండెను?
ⓐ గోపురములు
ⓑ ప్రాకారములు
ⓒ వసారాలు
ⓓ అంతస్థులు
11. గోతిలో వేయబడిన యిర్మీయాను "ముప్పది"మంది మనుష్యులను తీసుకొని పోయి అతడు చావకమునుపే తీయించుమని రాజు ఎవరికి సెలవిచ్చెను?
ⓐ మెమూ కానునకు
ⓑ ఎబెద్మెలెకునకు
ⓒ మిత్రిదాతునకు
ⓓ మెదెష్మెతునకు
12. దావీదు దగ్గర యున్న "ముప్పది" మందిలో ఎంతమంది బెత్లహేము ఊరి గవిని యొద్ద బావినీళ్ళు చేది తెచ్చిరి?
ⓐ నలుగురు
ⓑ ఆరుగురు
ⓒ ముగ్గురు
ⓓ అయిదుగురు
13. యేసు ఏమి మొదలు పెట్టినప్పుడు "ముప్పది"ఏండ్ల యీడుగలిగియుండెను?
ⓐ అద్భుతములు
ⓑ ప్రకటింప
ⓒ చాటింప
ⓓ బోధింప
14. ఇస్కరియోతు యూదా ఎవరి యొద్ద నుండి "ముప్పది"వెండి నాణెములు తీసుకొని యేసును ఆప్పగించెను?
ⓐ హేరోదురాజు
ⓑ యూదుల
ⓒ ప్రధానయాజకుల
ⓓ పరిసయ్యుల
15. అబ్బురముగా యెహోవా కొరకు ఏర్పర్చిన క్రయధనమైన "ముప్పది"తులముల వెండిని యెహోవా మందిరములో ఎవరికి ఆయన పారవేసెను?
ⓐ కమ్మరికి
ⓑ కుమ్మరికి
ⓒ కంచరికి
ⓓ కాసేవానికి
Result: