① ఎవరు ఇస్సాకును తన యజమానుడు అని చెప్పగానే రిబ్కా "ముసుకు"వేసుకొనెను?
② మోషే ఎవరితో యెహోవా తనతో చెప్పిన మాటలు చెప్పి తన ముఖము మీద "ముసుకు"వేసుకొనెను?
③ మోషే యెహోవాతో మాటలాడుటకు ఎక్కడికి వెళ్ళువరకు తన ముఖము మీద "ముసుకు వేసుకొనెను?
④ తగ్గిపోవుచున్న దేని యొక్క అంతమును ఇశ్రాయేలీయులు చూడకుండునట్లు మోషే తన ముఖము మీద "ముసుకు"వేసుకొనెను?
⑤ పాతనిబంధన చదువునప్పుడు అదిక్రీస్తునందు కొట్టివేయబడెనని ఏమి చేయబడక ఇశ్రాయేలీయులకు ఆ "ముసుకు"నిలిచియున్నది?
⑥ నేటి వరకును మోషే గ్రంధమును ఇశ్రాయేలీయులు చదువునప్పుడెల్ల "ముసుకు"వారి వేటి మీద నున్నది?
⑦ ఇశ్రాయేలీయుల హృదయము ఎవరి వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు "ముసుకు"తీసివేయబడును?
⑧ మేము ముఖము మీద "ముసుకు"వేసుకొనక ఏమి గలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నామని పౌలు అనెను?
⑨ ఇశ్రాయేలీయుల మనస్సులు ఏమాయెను గనుక ఆ "ముసుకే"నిలిచియున్నది?
①⓪. మనమందరము "ముసుకు"లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను దేనివలె ప్రతిఫలింపజేయుచున్నాము?
①① స్త్రీ "ముసుకు"లేనిదై దేవుని ఏమి చేయుట తగునా? అని పౌలు అనెను?
①② తలమీద "ముసుకు"వేసుకొని ప్రార్ధించిన ప్రవచించిన ఎవరు తన తలను అవమానపరచును?
①③ "ముసుకు వేసుకొనినదాననై నీ యొక్క ఎవరి మందల యొద్ద నేనెందుకుండవలెనని షూలమ్మితీ తన ప్రియునితో అనెను?
①④ "ముసుకు"గుండా నీ కన్నులు వేటివలె కనబడుచున్నవని ప్రియుడు షూలమ్మితో అనెను?
①⑤ "ముసుకు"వేటికి సాదృశ్యముగా నుండెను?
Result: