Telugu Bible Quiz Topic wise: 627 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మూడవ " అనే అంశము పై క్విజ్ )

1. మూడు అనగా నేమి?
ⓐ మూడు (సంఖ్య)
ⓑ ముగ్గురు
ⓒ మువ్వురు
ⓓ పైవన్నీ
2. బైబిల్ పరముగా మూడు అనగా అర్ధము తెల్పుము?
ⓐ త్రిత్వము
ⓑ పరిపూర్ణత
ⓒ సామరస్యము
ⓓ పైవన్నియు
3. మూడవ దినమున యెహోవా వేటిని సృజించెను?
ⓐ భూమి
ⓑ ఆకాశము
ⓒ ఫలవృక్షములు-చెట్లు
ⓓ పైవన్నియు
4. మూడవ దినము యెహోవాకు అర్పణము ఏ గోత్రము వారు తెచ్చెను?
ⓐ దాను
ⓑ జెబూలూను
ⓒ లేవి
ⓓ యూదా
5. తన ప్రజలైన ఎవరి కొరకు ఎస్తేరు మూడు దినములు ఉపవాసముండెను?
ⓐ షూషను ప్రజలు
ⓑ మొరైకై కుటుంబము
ⓒ యూదులు
ⓓ రాజుకుటుంబము
6. మమ్రే దగ్గర సింధూరవనములో ఎవరికి ముగ్గురు మనుష్యులు కనబడెను?
ⓐ లోతుకు
ⓑ ఇస్సాకుకు
ⓒ యాకోబుక్కు
ⓓ అబ్రాహాముకు
7 . మూడు పేటల త్రాడు ఏమవ్వదు?
ⓐ విడిపోదు
ⓑ తెగిపోదు
ⓒ ముక్కలవ్వదు
ⓓ ఊడిపోదు
8. ఆరోహణమైన తర్వాత మూడు దినములు ఏలీయాను ఎవరు వెదకిరి?
ⓐ ఎలీషా
ⓑ ఆహాబు రాజు
ⓒ ఎలీషా శిష్యులు
ⓓ యెజెబెలు
9. పగలు మూడు గంటలకు ఎవరు ప్రార్ధిస్తుండగా అతని యెదుట నిలిచెను?
ⓐ పేతురు
ⓑ యోహాను
ⓒ యాకోబు
ⓓ కొర్నేలి
10. పగలు మూడు గంటలకు ప్రార్ధనాకాలమున ఎవరు దేవాలయమునకు ఎక్కివెళ్ళెను?
ⓐ పేతురు - యోహాను
ⓑ తోమా - లెబ్బయి
ⓒ యూదా - ఫిలిప్పు
ⓓ యాకోబు - పేతురు
11. ప్రభువు దర్శించిన తర్వాత ఎవరు మూడు దినములు చూపు లేకుండా యుండెను?
ⓐ కొర్నేలి
ⓑ పేతురు
ⓒ పౌలు
ⓓ యోహాను
12. సంవత్సరమునకు ముమ్మారు ఎవరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను?
ⓐ స్త్రీలు
ⓑ యౌవనులు
ⓒ పిల్లలు
ⓓ పురుషులు
13. యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నము మొదలు ఎన్నిగంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను?
ⓐ ఐదు
ⓑ ఆరు
ⓒ మూడు
ⓓ నాలుగు
14. మూడవ దినమున యేసు ఎవరి నుండి లేపబడెను?
ⓐ మృతులలో
ⓑ సజీవులలో
ⓒ ప్రవక్తలలో
ⓓ సేవకులలో
15. త్రిత్వము అనగా ఎవరు?
ⓐ తండ్రి
ⓑ కుమారుడు
ⓒ పరిశుధ్ధాత్మ
ⓓ పైవారందరూ
Result: