Telugu Bible Quiz Topic wise: 631 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మూర్ఖులు" అనే అంశము పై క్విజ్ )

1. మూర్ఖునికి ఏమి అందదు?
ⓐ జ్ఞానము
ⓑ వివేకము
ⓒ ఆలోచన
ⓓ వివేచన
2. మూర్ఖుల వీపునకు ఏమి తగును?
ⓐ గుద్దులు
ⓑ బెత్తము
ⓒ రాయి
ⓓ కొరడా
3. మూర్ఖుని నోట ఏమి పాటి లేకుండును?
ⓐ పలుకు
ⓑ భాష
ⓒ సామెత
ⓓ భావము
4. ఎవరి నోట మూర్ఖపు మాటలు వచ్చును?
ⓐ బుద్ధిహీనుల
ⓑ పనికిమాలిన
ⓒ దుర్మార్గుల
ⓓ భక్తిహీనుల
5. మూర్ఖముగా మాటలాడువారు ఎక్కడ పడును?
ⓐ కీడులో
ⓑ గన పాపములో
ⓒ దుర్నీతిలో
ⓓ బంధకములో
6. మూర్ఖుని వలన కలుగు ఏమి నిలువదు?
ⓐ రాబడి
ⓑ లాభము
ⓒ ధనము
ⓓ ఆస్తి
7. మూర్ఖుడైన ప్రతివాడు ఏమి కోరును?
ⓐ జగడము
ⓑ ప్రతిఫలము
ⓒ పోరును
ⓓ ధనము
8. మూర్ఖులతో ఏమి చేయువాడు చెడిపోవును?
ⓐ స్నేహము
ⓑ పొత్తు
ⓒ జత
ⓓ సహవాసము
9. ఒక మూర్ఖత వాని యొక్క దేనిని తారుమారు చేయును?
ⓐ ప్రవర్తనను
ⓑ ఆలోచనను
ⓒ తలంపులను
ⓓ నడవడికను
10. మూర్ఖుని యొక్క ఏమి పాపము?
ⓐ తలంపు
ⓑ యోచన
ⓒ ఆలోచన
ⓓ మాటలు
11. మూర్ఖుని చేత ఏమి పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు?
ⓐ సమాచారము
ⓑ రాయబారము
ⓒ వర్తమానము
ⓓ మాటసాయము
12. మూర్ఖపు మాటలు పలుకువాని నాలుక ఏమి చేయబడును?
ⓐ కోసివేయబడును
ⓑ తీసివేయబడును
ⓒ మూసివేయబడును
ⓓ పెరికివేయబడును
13. మూర్ఖ ప్రవర్తన గలవాడు ఎలా పడిపోవును?
ⓐ హఠాత్తుగా
ⓑ భయముతో
ⓒ తొందరగా
ⓓ వెంటనే
14. మూర్ఖుడు జ్ఞానమును, ఉపదేశమును ఏమి చేయును?
ⓐ మరచిపోవును
ⓑ తిరస్కరించును
ⓒ త్రోసివేయును
ⓓ విడిచివేయును
15. మూర్ఖులు ఎవరికి హేయులు?
ⓐ యెహోవాకు
ⓑ తన యింటివరికి
ⓒ స్నేహితులకు
ⓓ బంధువులకు
Result: