Telugu Bible Quiz Topic wise: 635 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మేడ గది " అనే అంశంపై క్విజ్ )

1. మేడ గదులను ఎక్కడ కట్టుదురు?
ⓐ ఇంటి ప్రక్కన
ⓑ ఇంటి వెనుక
ⓒ ఆవరణములో
ⓓ ఇంటిపైన
2. దేవుని ఆలయములోని మేడ గదులు ఎన్ని అంతస్థులు గలవి?
ⓐ ఆరేసి
ⓑ ఐదేసి
ⓒ మూడేసి
ⓓ యేడేసి
3. మూడేసి అంతస్థులలో మేడ గదులు ఎన్ని ఉండెను?
ⓐ నలువది
ⓑ ముప్పది
ⓒ యేబది
ⓓ అరువది
4. ఆలయములోని మేడగదులకు ఆరు పెద్దమూరలు గల ఏమి యుండెను?
ⓐ పునాది
ⓑ ప్రాకారము
ⓒ ఆవరణము
ⓓ ప్రహారి
5. ఎక్కడ యెహోవా తన కొరకు మేడగదులు కట్టుకొనుచుండెను?
ⓐ పర్వతములపై
ⓑ ఆకాశమందు
ⓒ కొండలపై
ⓓ చంద్రునిపై
6. ఆలయములోని మేడ గదులు ఎక్కిన కొలది ఏది మరి వెడల్పుగా పెరిగెను?
ⓐ ఆవరణము
ⓑ అంతస్థు
ⓒ గోడ
ⓓ వాకిలి
7. ఆలయములోని మేడ గదుల యొక్క ఏమి ఖాళీగా నున్న స్థలము తట్టు ఉండెను?
ⓐ గుమ్మములు
ⓑ వాకిండ్లు
ⓒ ఆవరణములు
ⓓ తలుపులు
8. ఏమి తప్పి మేడ గదులు కట్టించుకొనుచు జీతమివ్వని వానికి శ్రమ?
ⓐ మార్గము
ⓑ త్రోవ
ⓒ సత్యము
ⓓ న్యాయము
9. చల్లని మేడ గదిలో కూర్చున్న మోయాబు రాజు ఎవరు?
ⓐ షీషా
ⓑ మేషా
ⓒ ఎగ్లోను
ⓓ యెబెరు
10. పౌలు సహోదరులతో కూడి యున్న మేడ గదిలో అనేకమైన ఏమి యుండెను?
ⓐ కిటికీలు
ⓑ దీపములు
ⓒ స్థంభములు
ⓓ వాకిండ్లు
11. ఏమి భుజించుటకు సామాగ్రి గల గొప్ప మేడ గదిని శిష్యులకు ఆ యజమాని చూపించునని యేసు చెప్పెను?
ⓐ ఆహారము
ⓑ భోజనము
ⓒ పస్కాను
ⓓ మేకను
12. ఎవరి శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి?
ⓐ ఐనెయ
ⓑ తబితా
ⓒ ఐతుకు
ⓓ ఐమీను
13. మేడ గది కిటికీలో నుండి క్రిందపడి రోగియైనదెవరు?
ⓐ అహజ్యా
ⓑ ఆహాజు
ⓒ హిజ్కియా
ⓓ అజర్యా
14. ఆహాబు మేడ గదిలో నున్న దేవతా బలిపీఠములను చిన్నాభిన్నము చేయించిన రాజు ఎవరు?
ⓐ యోవాషు
ⓑ ఉజ్జీయా
ⓒ యోషీయా
ⓓ యోతాము
15. యేసు ఆరోహణమైన తర్వాత ఎంతమంది మేడ గదికి ఎక్కిపోయిరి?
ⓐ రెండు వందలు
ⓑ నూట ముప్పది
ⓒ మూడు వందలు
ⓓ నూట ఇరువది
Result: