1. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల యొక్క ఏమియై యున్నదని పౌలు అనెను?
2..క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ఎలా వచ్చెను?
3. మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
4. బంధకములలో పడియుండియు ఏమి గలవారికి మేలు చేసెదనని యెహోవా చెప్పెను?
5. మేలుతో యెహోవా దేనిని తృప్తిపరచుచున్నాడని దావీదు అనెను?
6.మేలు చేయ నేర్చుకొని దేనిని జాగ్రత్తగా విచారించుమని యెహోవా అనెను?
7. నేను కట్టెదను నాటెదననిన జనము నా దృష్టి కి ఏమి చేసిన యెడల వారికి చేయదలచిన మేలు గురించి సంతాపపడెదనని యెహోవా అనెను?
8.యెహోవా యొక్క ఏమి నేర్చుకొనునట్లు శ్రమనొందియుండుట నాకు మేలు ఆయెనని కీర్తనాకారుడు అనెను?
9.మేలు చేసి శ్రమపడుట బహుమంచిదని ఎవరు అనెను?
10. దేవుని యొక్క దేని చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుమని పౌలు అనెను?
11. మేలు కలుగు మార్గమేది? అని అడిగి అందులో నడుచుకొనుమని యెహోవా ఏప్రవక్త ద్వారా సెలవిచ్చెను?
12. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎవరు యోచించెను?
13. దేవుని వలన మేలు అనుభవించుదమా?కీడు మనము అనుభవింపతగదా? అని యోబు ఎవరితో అనెను?
14. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడని యెహోవా ఏ ప్రవక్త ద్వారా యెరూషలేము యూదావారికి చెప్పెను?
15. యెహోవా నీ యొక్క దేని చొప్పున నీ సేవకునికి మేలు చేసియున్నాని కీర్తనాకారుడు అనెను?
Result: