1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో ఏది "యుక్తి" గలదై యుండెను?
2. తమ తరమునుబట్టి చూడగా ఎవరు "యుక్తి" పరులైయున్నారు?
3. సూర్యుని క్రింద ఒకడు జ్ఞానముతోను తెలివితోను "యుక్తి" తోను ప్రయాసపడి చేయుపని ఏమైయున్నది?
4. యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై ఎవరు చెప్పిన "యుక్తి" గల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను?
5. ఎవరు తన పనివారి ద్వారా ఓడలను, ఓడ నడుపుట యందు "యుక్తి" గల పనివారిని సొలొమోను యొద్దకు పంపెను?
6. ఎవరు తన చేతులను "యుక్తి" గా చాచి ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని ఉంచెను?
7. దావీదు బహు "యుక్తి" గా ప్రవర్తించుచున్నాడని ఎవరికి వినబడెను?
8. సకలవిధముల చెక్కడపు పని యందును మచ్చులు కల్పించుట యందును "యుక్తి" గలవాడు ఎవరు?
9. ఎవరి విషయమై "యుక్తి" గల యోచన చేతము రండని జనులు చెప్పు కొనుచుండిరి?
10. ఇశ్రాయేలీయులు విస్తరింపకుండునట్లు మనము వారియెడల "యుక్తి" గా జరిగించుదుమని ఎవరు అనుకొనెను?
11. "యుక్తి" గల స్త్రీ ప్రాకారము ఎక్కి ఎవరితో మాట్లాడెను?
12. లంచము దృష్టికి దేనివలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో "యుక్తి" గా ప్రవర్తించును?
13. క్రూరముఖము గలవాడును "యుక్తి" గలవాడునై యుండి, ఏమి తెలిసికొను ఒక రాజు పుట్టును?
14. నేను మీకు భారముగా ఉండలేదు గాని "యుక్తి" గలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో అని పౌలు ఎవరితో అనెను?
15. సర్పము తన "కుయుక్తి" చేత ఎవరిని మోసపరచెను?
Result: