1. పరిశుద్ధగ్రంధములో మొదటి "యుద్ధము" ఎవరు చేసెను?
2. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులతో ఎవరు రెఫీదీములో "యుద్ధము"చేసిరి?
3. శత్రువులతో "యుద్ధము"నకు బయలుదేరినపుడు ఏమి చేయకుండా జాగ్రత్తపడవలెనని మోషే జనులతో చెప్పెను?
4. సేనలో ఎంతమంది యుద్ధసన్నద్ధులై "యుద్ధము"చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములను దాటి వచ్చిరి?
5. దావీదు "యుద్ధము”చేయుటకు దేనిమీదికి పోయి దాని పట్టుకొనగా ఆ రాజు కిరీటము దావీదు తలమీద పెట్టబడెను?
6. సౌలు ఎవరి నిమిత్తము అమ్మోనీయులతో "యుద్ధము"చేసెను?
7. ఏ రాజు సంవత్సరములలో "యుద్ధములు"లేకపోవుటచేత దేశము నెమ్మదికలిగియుండెను?
8. మోయాబీయులు అమ్మోనీయులు మెయోనీయులు యెహోషాపాతు మీదికి రాగా అతను భయపడగా ఎవరు ఈ "యుద్ధము"దేవుడే జరిగించునని చెప్పెను?
9. అష్షూరు రాజు ఏ రాజు కాలములో "యుద్ధమునకు"రాగా అతను యెహోవాకు ప్రార్ధించగా ఆయన తన దూతను పంపెను?
10. "యుద్ధము"నకు వేటిని సిద్ధపరచుట కద్దు, రక్షణ యెహోవా ఆధీనము?
11. వివేకముగల ఏమియై "యుద్ధము"చేయవలెను?
12. ఒకడు తమ నోట ఆహారము పెట్టని యెడల ఎవరు జనులను పొరపెట్టి " యుద్ధము" ప్రకటించును?
13. "యుద్ధమునకు"ఏమి కలదని ప్రసంగి చెప్పుచుండెను?
14. "యుద్ధము" కొరకు నేను దాచియుంచిన వడగండ్లను నీవు చూచితివా? అని యెహోవా ఎవరితో అనెను?
15. నా యొక్క వేటికి "యుద్ధము"నేర్పువాడు యెహోవాయే అని దావీదు అనెను?
Result: