1Q. యౌవనకాలమున కాడి మోయుట ఎవరికి మేలు?
2 Q. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు ఎవరు తప్పక తొట్రిల్లుదురు?
3Q. ఎవరు పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనెను?
4Q. బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడునులేడని ఎవరి గూర్చి చెప్పబడెను?
5Q. యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందరు?
6 Q. ఏమి గలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించవలెను?
7Q. పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము చేసినరాజు ఎవరు?
8. నీ యౌవనకాలపు ఎవరియందు సంతోషింపుము?
9Q. యౌవనకాలమందు పుట్టిన కుమారులు ఎవరి చేతిలోని బాణములవంటివారు?
10 Q. కిటికీలో కూర్చుండి నిద్రా భారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయి యెత్తబడిన యౌవనస్థుడు ఎవరు?
11Q. ఐశ్వర్యమునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక, జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగిన యౌవనస్థుడు ఎవరు?
12 Q. ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు ఏ విధమైన బలులగా కోడెలను వధించిరి.
13Q. మహా బలాఢ్యుడును, యౌవనుగు ఎవరు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొనెను?
14Q. నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము) అని పౌలు ఎవరితో చెప్పెను?
15. అంత్యదినముల యందు నా(దేవుని) ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించగా యౌవనులకు ఏమి కలుగును?
Result: