1. ఎవరు దండెత్తి వచ్చి యెరూషలేములో పెద్దలందరిని చంపిరి?
2 . యెరూషలేము కాపురస్థులు యెహోరాము కడగొట్టు కుమారుడైన ఎవరిని యూదారాజుగా చేసిరి?
3 . అహజ్యా తల్లి పేరేమిటి?
4 . అహజ్యాకు అతని తల్లి ఎలా ప్రవర్తించుట నేర్పించెను?
5 . ఎవరి సంతతివలె అహజ్యా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను?
6 . యెహోరాము మరణమైన తర్వాత ఆహాబు సంతతి వారు అహజ్యాకు ఏమైరి?
7 . ఆహాబు సంతతవారు ఆలోచనలు చెప్పి అహజ్యా యొక్క దేనికి కారణమైరి?
8 . ఆహాబు సంతతివారి ఆలోచన చొప్పున అహజ్యా సిరియ రాజైన ఎవరి మీదికి యుద్ధమునకు పోయెను?
9 . ఇశ్రాయేలు రాజైన ఎవరితో కలిసి అహజ్యా సిరియ మీదకు యుద్ధమునకు పోయెను?
10 . సిరియనుల చేత యుద్ధములో ఇశ్రాయేలు రాజునకు ఏమి తగిలెను?
11. ఇశ్రాయేలు రాజును దర్శించుటకు అహజ్యా ఎక్కడికి వెళ్ళెను?
12 . ఇశ్రాయేలు రాజు నొద్దకు అహజ్యా పోవుట చేత ఎవరి వలన అతనికి నాశము కలిగెను?
13 . యెహోవా అభిషేకించిన ఎవరి మీదకు యెహోరాము అహజ్యాతో కలిసి యుద్దమునకు పోయెను?
14 . ఆహాబు సంతతి వారికి ఏమి తీర్చుటకు యెహోవా యెహును పంపెను?
15 . ఏమైన అహజ్యాను యెహు పట్టుకొని చంపెను?
Result: