1. అమాజ్యా ఏయే దేశమంతటను సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను?
2. ఎన్ని సంవత్సరములు మొదలుకొని పైప్రాయము గల వారిని అమజ్యా లెక్కించెను?
3. ఈటెలు డాళ్ళను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు ఎన్ని లక్షలమంది యుండిరి?
4. అమజ్యా ఇశ్రాయేలీయులలో ఎంతమంది పరాక్రమశాలురను కుదిర్చెను?
5. ఇశ్రాయేలు పరాక్రమశాలురను అమాజ్యా ఎంత వెండికి కుదిర్చెను?
6. ఇశ్రాయేలు సైన్యమును అమాజ్యాతో తీసుకొని పోవద్దని ఎవరు చెప్పెను?
7. యెహోవా ఇశ్రాయేలు వారిలో ఎవరికి తోడుగా ఉండడని దైవజనుడు అమజ్యాతో చెప్పెను?
8. ఇశ్రాయేలువారితో పోయిన యెహోవా అమజ్యాకు ఎవరి మీద జయమియ్యడని దైవజనుడు చెప్పెను?
9. ఇశ్రాయేలు వారిని తిరిగి పొమ్మని అమాజ్యా సెలవియ్యగా వారి కోపము ఎవరమీద రగులుకొనెను?
10. ఇశ్రాయేలీయులు ఏమియై తమ ఇండ్లకు తిరిగివెళ్ళిరి?
11. అమజ్యా ఏమి తెచ్చుకొని శత్రువులపై యుద్ధమునకు వెళ్ళెను?
12. అమ్యా శేయీరు మన్యములో ఎంతమందిని హతము చేసెను?
13. అమజ్యా పంపివేసిన ఇశ్రాయేలు వారు యూదా వారి మీద పడి ఎంతమందిని హతము చేసిరి?
14. అమజ్యా ఎవరిని ఓడించి తిరిగి పోయెను?
15. అమజ్యా శేయీరు వారి వేటిని తీసుకొనివచ్చెను?
Result: