1. అమజ్యాపై యెహోవా యొక్క కోపము ఏమాయెను?
2. అమజ్యా యొద్దకు యెహోవా ఎవరిని పంపెను?
3. జనులను విడిపించు ఏమి లేని వాటి యొద్ద ఎందుకు విచారణ చేయుదువని ప్రవక్త అమజ్యాతో అనెను?
4. అమజ్యా ప్రవక్త యొక్క దేనిని అంగీకరించలేక పోయెను?
5. మనము ఒకరి ముఖము ఒకరము చూచుకొందము రమ్మని అమజ్యా ఇశ్రాయేలు రాజైన ఎవరికి వర్తమానము పంపెను?
6. యెహోయాషు అమజ్యాతో, నీవు గర్వించి నా జోలికి వచ్చి ఏమి తెచ్చుకోవద్దని అనెను?
7. యూదావారు ఎవరి దేవతల యొద్ద విచారణ చేయవచ్చిరి?
8. యూదాజనులు చేయు వాటి వలన యెహోవా వారిని ఎవరికి అప్పగింతుననెను?
9. యెహోయాషు వర్తమానమును అమజ్యా దేవుని యొక్క దేని వలన అంగీకరింపలేకపోయెను?
10. ఎక్కడ యూదా, ఇశ్రాయేలు రాజులు ఒకరి ముఖము ఒక్కరు చూచుకొనిరి?
11. యూదా వారు ఎవరి యెదుట నిలువలేక తమ గుడారములకు పారిపోయిరి?
12. ఇశ్రాయేలు రాజు యూదారాజును ఎక్కడికి తీసుకొని వచ్చెను?
13. దేవుని మందిరములో ఎవరి యొద్ద నున్న వెండిబంగారములను ఇశ్రాయేలు రాజు తీసుకొనెను?
14. అను చంపుటకు జనులు కుట్ర చేయగా అతను ఎక్కడికి పారిపోయెను?
15. లాకీషులో అమజ్యాను చంపిన జనులు వేటి మీద అతనిని యెరూషలేముకు తెచ్చిరి?
Result: