Telugu Bible Quiz Topic wise: 664 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యూదావారి ఏడవరాజు " అనే అంశము పై క్విజ్-1 )

1. యోవాషు ఎవరి కుమారుడు?
ⓐ అహజ్యా
ⓑ ఆహాజు
ⓒ అమ్రాజ్యా
ⓓ ఆహూజు
2. యోవాషు తల్లి పేరేమిటి?
ⓐ అజూబా
ⓑ జిబ్యా
ⓒ హెప్సిబా
ⓓ యెదీద్యా
3. ఎన్ని సంవత్సరముల ఈడుగలవాడై యోవాషు ఏలనారంభించెను?
ⓐ ఎనిమిది
ⓑ తొమ్మిది
ⓒ ఏడు
ⓓ పండ్రెండు
4. యాజకుడైన యెహోయాదా యోవాషునకు ఎంతమంది భార్యలను పెండ్లిచేసెను?
ⓐ ముగ్గురు
ⓑ ఐదుగురు
ⓒ నలుగురు
ⓓ యిద్దరు
5. యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించెను?
ⓐ నిష్కపటముగా
ⓑ యధార్ధముగా
ⓒ న్యాయముగా
ⓓ నిందారహితముగా
6. యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు ఏమి పుట్టెను?
ⓐ ఆలోచన
ⓑ తలంపు
ⓒ తాత్పర్యము
ⓓ యోచన
7. దేవుని మందిరమును బాగుచేయుటకు యాజకులను,లేవీయులను యోవాషు ఏమిచేసెను?
ⓐ పిలిచెను
ⓑ ఏర్పర్చను
ⓒ విభజించెను
ⓓ సమకూర్చెను
8. ఎవరి యొద్ద నుండి మందిరమును బాగుచేయుటకు ధనమును యోవాషు సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చెను?
ⓐ ప్రధానుల
ⓑ ఇశ్రాయేలీయుల
ⓒ మంత్రుల
ⓓ పెద్దల
9. దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరఉపకరణములను దేనికి ఉపయోగించిరి?
ⓐ విందులకు
ⓑ వినోదములకు
ⓒ భుజించుటకు
ⓓ బయలుదేవతపూజకు
10. ఎవరు నిర్ణయించిన కానుకను సేకరించలేదని యోవాషు యెహోయాదాను అడిగెను?
ⓐ మోషే
ⓑ సమూయేలు
ⓒ సౌలు
ⓓ దావీదు
11. రాజు ఆజ్ఞప్రకారము యెహోయాదా ఒక పెట్టె చేయించి ఎక్కడ పెట్టెను?
ⓐ పడమటిగుమ్మము
ⓑ మందిర ద్వారము
ⓒ మందిరఆవరణము
ⓓ దక్షిణగుమ్మము
12. మోషే ఎక్కడ ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను తేవలెనని జనులకు చాటించిరి?
ⓐ కొండపై
ⓑ ఎడారిలో
ⓒ సముద్రమునొద్ద
ⓓ అరణ్యములో
13. అధిపతులు, జనులందరు ఎలా కానుకలను తీసుకొని వచ్చి పెట్టెలో వేసిరి?
ⓐ సంభ్రముగా
ⓑ వాయిద్యములతో
ⓒ సంతోషముగా
ⓓ పరుగెత్తుతూ
14. ఎవరు కానుకల పెట్టెను రాజు విమర్శస్థలమునకు తెచ్చుచుండిరి?
ⓐ అధిపతులు
ⓑ లేవీయులు
ⓒ యాజకులు
ⓓ ప్రధానులు
15. ఎంత ధనము సమకూడినపుడు ప్రధానమంత్రి,పైవిచారణకర్తలు దానిని తీసెడివారు?
ⓐ ఎక్కువగా
ⓑ అధికముగా
ⓒ హెచ్చుగా
ⓓ విస్తారముగా
Result: