1. విస్తారమైన ద్రవ్యమును రాజును, యెహోయాదాయు ఏ పని చేయుటకు ఇచ్చిరి?
2. యెహోవా మందిరపు పనిచేయుటకు, దాని బలపరచుటకు ఎవరెవరిని పనికి కుదిర్చిరి?
3. యెహోవా మందిరపు పనిని పనివారు ఏమి చేసిరి?
4. దేవుని మందిరమును ఎలా తీసుకొని వచ్చి పనివారు దాని బలపరచిరి?
5. మిగిలిన ద్రవ్యముతో యెహోవా మందిరసేవకు,దహనబలుల అర్పణలకు ఉపయోగపడు వేటిని చేయించిరి?
6. ఎవరు యున్నది మొదలు యెహోవామందిరములో దహనబలులు నిత్యము అర్పింపబడెను?
7. యెహోయాదా ఎన్ని సంవత్సరములు గల వృద్ధుడై చనిపోయెను?
8. యెహోయాదా దేవుని దృష్టికిని, తన ఇంటివారి దృష్టికిని ఎలా ప్రవర్తించెను?
9. యెహోయాదాను ఏ పట్టణములో రాజుల దగ్గర పాతిపెట్టిరి?
10. యెహోయాదా చనిపోయిన యోవాషు తనకు నమస్కరించిన ఎవరి మాటలకు సమ్మతించెను?
11. జనులు దేనిని విడిచి దేవతాస్థంభములకు, విగ్రహములకు పూజలు చేసిరి?
12. దేని నిమిత్తము యూదా, యెరూషలేము వారి మీదికి యెహోవా కోపము వచ్చెను?
13. తన వైపునకు మళ్ళించుటకై యెహోవా ప్రజల యొద్దకు ఎవరిని పంపెను?
14. ప్రవక్తలు జనుల మీద ఏమి పలికిరి?
15. అయినను జనులు ఎలా నుండిరి?
Result: