1. యెహోషాపాతు కుమారుల పేర్లేమిటి?
2 . యెహోషాపాతు తన కుమారుడైన ఎవరికి రాజ్యము నిచ్చెను?
3 . యెహోరాము తన రాజ్యమును ఏమి చేసుకొనెను?
4 . యెహోరాము తన సహోదరులనందరిని ఏమి చేసెను?
5 . యెహోరాము ఏలనారంభించినపుడు ఎన్ని యేండ్లవాడు?
6. యెహోరాము ఇశ్రాయేలు రాజైన ఎవరి కుమార్తెను పెండ్లిచేసుకొనెను?
7 . ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచి యెహోరాము యెహోవా దృష్టికి ఎలా నడిచెను?
8 . యెహోరాము దినములలో ఎవరు తిరుగుబాటు చేసిరి?
9 . ఎదోమీయులు యూదావారి దేనిని త్రోసివేసిరి?
10 . యెహోరాము తన అధిపతులతో కలిసి ఎప్పుడు ఎదోమీయుల రధాధిపతులను హతము చేసెను?
11. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను ఏమి చేసెను?
12 . యెహోరాము కాలములో ఎవరు అతని చేతిక్రింద నుండి తిరుగబడెను?
13 . పర్వతముల యందు యెహోరాము ఏమి కట్టించెను?
14 . యెహోరాము యూదా వారిని దేనికి లోబరచెను?
15 . ఎవరు పత్రిక వ్రాసి యెహోరాము నొద్దకు పంపెను?
Result: