1. ప్రవక్తలందరు యెహోవా ఆహాబుకు ఏమి ఇచ్చునని ప్రవచించుచుండిరి?
2. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతనితో ప్రవక్తలందరు రాజు విషయమై ఎలా మేలు పలుకుచున్నారని అనెను?
3. మీకాయాను పిలిచిన దూత ప్రవక్తల మాటలకు అతనిని ఎలా ప్రవచింపమని చెప్పెను?
4. యెహోవా యొక్క దేని తోడు నాదేవుడు సెలవిచ్ఛిన దానినే ప్రవచింతునని మీకాయా అనెను?
5. మీకాయా ఎవరు కాపరి లేని గొర్రెల వలె నున్నారని యెహోవా సెలవిచ్చెనని ఆహాబుతోఅనెను?
6. ఇశ్రాయేలు వారు దేని మీద చెదరిపోయి యున్నారని యెహోవా సెలవిచ్చియున్నాడని మీకాయా ఆహాబుతో అనెను?
7. ఇశ్రాయేలు వారికి ఎవరు లేరని యెహోవా సెలవిచ్చియున్నాడని మీకాయా ఆహాబుతో అనెను?
8. యెహోవా తన సింహాసనముపై ఆసీనుడై యుండి, ఎవరు ఆయన కుడిఎడమ ప్రక్కగా యుండుట మీకాయా తాను చూచెనని చెప్పెను?
9. ఆహాబు రామోత్గలాదు మీదికి పోవునట్లు ఎవడు ఆతనిని ఏమి చేయునని యెహోవా అడుగుచున్నాడని మీకాయా చెప్పెను?
10. ఎవరు నేను ఆహాబును ప్రేరేపించెదనని అనెను?
11. ఆ ఆత్మ ప్రవక్తలందరి నోట ఎటువంటి ఆత్మగా నుందునని యెహోవాతో అనెను?
12. యెహోవా అబద్ధములాడు ఆత్మను ఆ ప్రవక్తలలో యుంచి ఆహాబు మీద ఏమి పలికించెనని మీకాయా అనెను?
13. ఎవరు మీకాయాను చెంపమీద కొట్టెను?
14. సిద్కియా, నీతో మాటలాడిన ఏది నా యొద్దనుండి ఏమార్గమున పోయెనని మీకాయాను అడిగెను?
15. మీకాయాను ఆహాబు పట్టణపు అధిపతియైన ఎవరి చేతికి అప్పగించెను?
Result: