1. యూదా దేశము చుట్టూ యుండు దేశముల వేటి అన్నిటి యందు యెహోవా భయము వాటికి కలిగెను?
2. చుట్టూ యున్న రాజ్యముల వారు యెహోషాపాతుతో ఏమి చేయకుండిరి?
3. ఫిలిష్తీయులందరు యెహోషాపాతుకు ఏమి ఇచ్చుచుండిరి?
4. ఎవరు యెహోషాపాతునకు ఏడువేల ఏడువందల గొర్రెలు, ఏడువేల ఏడువందల మేకపోతులను తెచ్చుచుండిరి?
5. యెహోషాపాతు అంతకంతకు ఏమి అయ్యెను?
6. ఎక్కడ యెహోషాపాతు కోటలను, సామాను నిలువచేయు పట్టణములను కట్టించెను?
7. యూదాదేశపు పట్టణములలో యెహోషాపాతుకు ఏమి కూర్చబడెను?
8. యెహోషాపాతు క్రింద ఎవరు యెరూషలేములో కూడియుండిరి?
9. యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన సహస్రాధిపతి ఎవరు?
10. యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడెవరు?
11. యెహోషాపాతు దగ్గర యున్న పరాక్రమశాలులు ఎంతమంది?
12. తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఎవరితో యెహోషాపాతు వియ్యమొందెను?
13. కొన్ని సంవత్సరములు గతించిన తర్వాత యెహోషాపాతు ఎక్కడ యున్న ఆహాబు నొద్దకు పోయెను?
14. ఆహాబు యెహోషాపాతుకు అతని వెంట వచ్చిన జనుల కొరకు వేటిని కోయించెను?
15. దేని మీదికి పోవుటకు ఆహాబు యెహోషాపాతును ప్రేరేపించెను?
Result: