1. ఆహాబుతో, యెహోషాపాతు ఎక్కడికి నీతో వచ్చెదననెను?
2. యెహోషాపాతు ఆహాబుతో ఎవరి యొద్ద సంగతి చేయుదము రండనెను?
3. ఆహాబు ఎంతమంది ప్రవక్తలను సమకూర్చెను?
4. దేవుడు ఎవరి మీదికి యుద్ధమునకు వెళితే వారిని ఆహాబు చేతికి ఆప్పగించునని ప్రవక్తలు ప్రవచించిరి?
5. యెహోవా యొద్ద ఏమి చేయుటకు ఈ ప్రవక్తలు తప్ప ఎవరూ లేరా, అని యెహోషాపాతు ఆహాబుతో అనెను?
6. ఆహాబు, ఇమ్లా కుమారుడైన ఎవరు యున్నారని యెహోషాపాతుతో అనెను?
7. మీకాయా తనను గూర్చి ఏమి ప్రవచింపడని ఆహాబు, యెహోషాపాతుతో అనెను?
8. నిత్యము తనను గూర్చి మీకాయా ఏమి ప్రవచించునని ఆహాబు యెహోషాపాతుతో అనెను?
9. మీకాయా మీద తనకు ఏమి కలదని ఆహాబు యెహోషాపాతుతో అనెను?
10. మీకాయాను ఎలా రప్పించుమని ఆహాబు తన పరివారమునకు ఆజ్ఞాపించెను?
11. ఇశ్రాయేలు, యూదా రాజులు ఏ ఊరు గవిని యొద్దకు వచ్చిరి?
12. ఇశ్రాయేలు, యూదా రాజులు తమ యొక్క ఎక్కడ కూర్చొనియుండిరి?
13. నాలుగు వందలమంది ప్రవక్తలలో ఒకడైన ఎవడు రాజునొద్దకు వచ్చెను?
14. సిద్కియా వేటిని చేయించుకొని వచ్చెను?
15. ఎవరు నిర్మూలమగు వరకు వారిని ఆ యినుపకొమ్ములతో పొడిచెదవని ఆహాబు ఎదుట ప్రవక్తలు ప్రవచించెను?
Result: