1. ఆసా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు యూదా రాజాయెను?
2. యెహోషాపాతు రాజై ఎవరు తన మీదికి రాకుండ తన రాజ్యమును బలపరచుకొనెను?
3. యెహోషాపాతు యూదా దేశములో వేటి దగ్గర సైన్యములను ఉంచెను?
4. తన తండ్రియైన ఆసా పట్టుకొనిన ఏ పట్టణములయందు యెహోషాపాతు కావలి బలములనుంచెను?
5. యెహోవా యెహోషాపాతుకు ఎలా యుండెను?
6. ఎవరు ప్రారంభదినములలో నడిచిన మార్గములలో యెహోషాపాతు నడచుకొనెను?
7. ఎవరిని ఆశ్రయించక యెహోషాపాతు తన తండ్రి దేవుని ఆశ్రయించెను?
8. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక యెహోషాపాతు వేటిని అనుసరించి నడిచెను?
9. యెహోవా యెహోషాపాతు రాజ్యమును స్థిరపరచిన తర్వాత ఎవరు అతనికి పన్ను ఇచ్చుచుండిరి?
10. యెహోషాపాతుకు ఐశ్వర్యము, ఘనతయు ఎలా కలిగెను?
11. యెహోవా మార్గముల యందు నడచుకొనుచు యెహోషాపాతు తన యొక్క దేనిని స్థిరపరచుకొనెను?
12. యూదాలో నుండి యెహోషాపాతు వేటిని తీసివేసెను?
13. తన యేలుబడిలో యెహోషాపాతు యూదాజనులకు ఏమి బోధ చేయించుటకు పూనెను?
14. ధర్మశాస్త్రమును బోధించుటకు ఎంతమంది పెద్దలలో లేవీయులను,యాజకులను యెహోషాపాతు పంపెను?
15. లేవీయులు, యాజకులు ధర్మశాస్త్రగ్రంధమును చేత బట్టి ఏమి చేసిరి?
Result: