1. యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు, సందేహాశ్మములను పరిష్కరించుటకు యెహోషాపాతు ఎవరెవరిలో పెద్దలను ఏర్పర్చెను?
2. పెద్దలను యెహోవా యందు ఏమి కలిగి నమ్మకముగా యధార్ధముగా ప్రవర్తించమని యెహోషాపాతు చెప్పెను?
3. సహోదరులు తెచ్చు ఏయే సంగతులను గూర్చి విమర్శ చేయునపుడు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరించుమని యెహోషాపాతు చెప్పెను?
4. ప్రధానయాజకుడైన ఎవరు సకల విషయములను కనిపెట్టుటకు పెద్దలకు యుండెను?
5 అధిపతియైన ఎవరు రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉండెను?
6. జెబద్యా ఏ సంతతికి చెందినవాడు?
7. ఎవరు పరిచారకులై యున్నారు?
8. ఏమి వహించుమని యెహోషాపాతు పెద్దలతో చెప్పెను?
9. ఏమి చేయుటకు యెహోవా మీతోకూడా ఉండునని యెహోషాపాతు పెద్దలతో అనెను?
10. యెహోషాపాతు మీదికి ఎవరెవరు దండెత్తి వచ్చిరి?
11. సముద్రము అవతల ఎవరి తట్టునుండి గొప్ప సైన్యము వచ్చుచున్నదని కొందరు యెహోషాపాతుకు తెలియజేసిరి?
12. ఆ సైన్యము గురించి విని యెహోషాపాతు ఏమాయెను?
13. ఎవరి యొద్ద విచారణ చేయుటకు యెహోషాపాతు తన మనస్సు నిలుపుకొనెను?
14. యెహోషాపాతు యూదా యందంతట ఏమి ఆచరింపవలెనని చాటించెను?
15. యూదావారందరు యెహోవా వలన ఏమి వేడుకొనుటకు కూడుకొనిరి?
Result: