1. యెహోషాపాతు యెహోవాకు ఏమి చేసెను?
2. ఆ గొప్పసైన్యమునకు ఏమి తీర్చమని యెహోషాపాతు యెహోవాకు ప్రార్ధించెను?
3. ఆ గొప్పసైన్యముతో యుద్ధము చేయుటకు మాకు ఏమి చాలదని యెహోషాపాతు ప్రార్ధించెను?
4. మాకు ఏమితోచకయున్నది, నీవే మాకు ఏమని యెహోషాపాతు యెహోవాకు ప్రార్ధించెను?
5. యూదావారందరు ఎవరెవరితో యెహోవా సన్నిధిని నిలిచిరి ?
6. సమాజములో లేవీయుడగు ఎవరు యుండెను?
7. యహజీయేలు ఎవరి సంతతికి చెందినవాడు?
8. యహజీయేలు మీదకు ఏమి వచ్చెను?
9. యుద్ధము ఎవరు జరిగించునని యహజీయేలు ప్రకటించెను?
10. యుద్ధములో యూదావారు ఏమి చేయవలసిన నిమిత్తము లేదని యహజీయేలు ప్రకటించెను?
11. గొప్పసైన్యము ఏమి అను ఎక్కుడుమార్గమున వచ్చెదరని యహజీయేలు ప్రకటించెను?
12. ఏ అరణ్యమందున్న వాగు దగ్గర ఆగొప్ప సైన్యమును కనుగొందురని యహజీయేలు ప్రకటించెను?
13. యూదావారిని ఎలా తీర్చి నిలువబడమని యెహోవా సెలవిచ్చెను?
14. యెహోవా దయచేయు దేనిని యూదావారు చూచెదరని యహజీయేలు ప్రకటించెను?
15. యెహోవా చేయించిన ప్రకటన విని యెహోషాపాతు ఏమి చేసెను?
Result: