1. యూదావారు, యెరూషలేము వారు ఎక్కడ సాగిలపడి నమస్కరించిరి?
2. కహాతీయులు, కోరహీయులలోని లేవీయులు నిలువబడి ఎలా యెహోవాను స్తుతించిరి?
3.యూదావారు ఉదయమునే లేచి ఏ అరణ్యమునకు పోయిరి?
4. యెహోషాపాతు జనులతో యెహోవాను ఏమి చేయమని చెప్పెను?
5. యెహోవాను నమ్ముకొనుట వలన ప్రజలు ఏమౌదురని యెహోషాపాతు చెప్పెను?
6. యెహోవా యొక్క ఎవరిని నమ్ముటవలన ప్రజలు కృతార్ధులవుదురని యెహోషాపాతు అనెను?
7. జనులను హెచ్చరిక చేసి యెహోవాను స్తుతించుటకు యెహోషాపాతు ఎవరిని ఏర్పరచెను?
8. గాయకులు ఏమి ధరించి సైన్యము ముందర నడువవలెనని యెహోషాపాతు చెప్పెను?
9. యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని ఏమి చేయుటకు యెహోషాపాతు గాయకులను నియమించెను?
10. గాయకులు పాడుటకు, స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకు వచ్చే ఎవరెవరి మీద మాటుగాండ్రను పెట్టెను?
11. యెహోవా మాటుగాండ్రను పెట్టుట వలన ఆ గొప్పసైన్యము ఏమాయెను?
12. మాటుగాండ్రు ఆ గొప్పసైన్యమును బొత్తిగా చంపి ఏమి చేయవలెనని పొంచియుండిరి?
13. ఆ గొప్పసైన్యమును కడముట్టించిన తర్వాత మాటుగాండ్రు ఒకనినొకడు ఏమి చేయ మొదలు పెట్టెను?
14. యూదావారు అరణ్యమందున్న దేని దగ్గరగా వచ్చెను?
15. యూదావారు సైన్యము తట్టు చూడగా వారు ఏమియై నేలపడియుండిరి?
Result: