1. యూదా వారందరు దేవుని మందిరములో చేరి రాజుతో ఏమి చేసిరి?
2. దావీదు కుమారులులో ఎవరు రాజ్యమేలునని యెహోయాదా చెప్పెను?
3. యెహోయాదా యాజకులలో, లేవీయులలో విశ్రాంతిదినమున లోపల ప్రవేశించుటకు ఎన్ని భాగములు చేసెను?
4. ఒక భాగము వారు ఎలా యుండవలెను?
5. ఒక భాగము దేని యొద్ద యుండవలెను?
6. జనులందరు యెహోవా మందిరము యొక్క ఎక్కడ యుండకూడదు?
7. యాజకులు, లేవీయులు ఏమి చేయబడిన వారు గనుక మందిరములో యుండవలెను?
8. లేవీయులు తమ తమ యొక్క ఏమి పట్టుకొని రాజు నొద్ద యుండవలెను?
9. మందిరములోనికి ఎవరైనా వచ్చిన వారికి ఏమి విధించవలెను?
10. లేవీయులు, యాజకులు యూదావారందరు ఎవరి ఆజ్ఞ చొప్పున చేయుచుండిరి?
11. యెహోయాదా రాజైన దావీదు ఉంచిన బల్లెములను,కేడెమును, డాళ్ళను ఎవరికి అప్పగించెను?
12. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి ఆతని తలమీద ఏమి యుంచిరి?
13. రాజు చేతికి ఏ గ్రంధము ఇవ్వబడెను?
14. రాజుకు ఏమి చేసిరి?
15. రాజు అభిషేకించి, రాజు ఏమి యగును గాక అనిరి?
Result: