1 . జనులు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతో, బూరల నాదముతోను, భేరీధ్వనులతోను ఏమి చేసిరి?
2 . జనులు ఈలాగు ప్రమాణము చేయుచుండగా ఎవరు సంతోషించిరి?
3 . యూదావారు ఎలా ప్రమాణము చేసి, ఎలా యెహోవాను వెదికియుండిరి?
4 . యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న ఎవరితో యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేసెను?
5 . ఆసా తల్లి యైన ఎవరు అసహ్యమైన దేవతాస్థంభములను నిలిపెను?
6. ఆసా తన తల్లి ఏమియై యుండకుండా ఆమెను త్రోసివేసెను?
7 . ఆసా తనతల్లి నిలువబెట్టిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నము చేసి ఏ వాగు దగ్గర కాల్చివేసెను?
8 . ఆసా బ్రతికినంత కాలము అతని హృదయము ఎలా ఉండెను?
9 . తన తండ్రి, తాను ప్రతిష్టించిన వేటిని ఆసా దేవుని మందిరములో ఉంచెను?
10 . ఆసా యేలుబడి యందు ఎన్నవ సంవత్సరము వరకు యుద్ధములు జరుగలేదు?
11. ఆసాతో యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు రాజైన ఎవరు రామా పట్టణమును కట్టించెను?
12 . ఆసా యెహోవా మందిరము, రాజనగరు నందున్న వెండి బంగారము సిరియా రాజైన ఎవరికి పంపెను?
13 . ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుట కొరకు ఆసా సిరియ రాజైన బెన్హదదుతో ఏమి చేసుకొనెను?
14 . బెన్హదదు ఆసా మాట విని తన సైన్యములలో ఎవరిని ఇశ్రాయేలీయుల పట్టణముల మీదికి పంపెను?
15 . ఆసా యూదావారిని ఏమి చేయగా, వారు బయెషా కట్టించిన రామా పట్టణము యొక్క రాళ్ళను, దూలములను తెచ్చిరి?
Result: