1. ఆసా యొద్దకు దీర్ఘదర్శియైన ఎవరు వచ్చెను?
2 . ఆసా దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఎవరిని నమ్ముకొనెనని హనానీ అనెను?
3 . సిరియా రాజు యొక్క ఎవరు ఆసా వశము నుండి తప్పించుకొని పోయెను?
4 . ఆసా మీదికి దండెత్తి వచ్చినదెవరు?
5 . అసా యెహోవాను ఏమి చేసెను?
6. ఆసా యెహోవాను నమ్ముకొనినందున ఎవరిని దేవుడు అతని చేతికి అప్పగించెను?
7 . తన యెడల యధార్ధహృదయులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఎక్కడ సంచారము చేయుచున్నది?
8 . యదార్ధత విషయములో ఆసా ఏమియై ప్రవర్తించెను?
9 . ఆసాకు ఇది మొదలు ఏమి కలుగునని హనానీ ప్రకటించెను?
10 . హనానీ ప్రకటన వినిన ఆసాకు ఏమి వచ్చెను?
11. ఆసా హనానీ మీద ఏమి చూపెను?
12 . ఆసా హనానీని ఎక్కడ వేసేను?
13 . ఆసా యొక్క యేలుబడి యందు ఎన్నవ సంవత్సరమున అతని పాదములలో జబ్బు పుట్టెను?
14 . తన పాదములలో పుట్టిన జబ్బు వలన ఆసా ఏమి పడినను, ఆ విషయములో యెహోవా యొద్ద విచారణ చేయక వెద్యులను పట్టుకొనెను?
15. తన యేలుబడిలో ఎన్నవ సంవత్సరమున ఆసా తన పితరులతో నిద్రించెను?
Result: