1. ఇశ్రాయేలీయుల నుండి విడిపోయిన తర్వాత యూదులను ఏలిన మొదటి రాజు ఎవరు?
2 . రెహబాము ఎవరి కుమారుడు?
3 . రెహబాము తల్లి పేరేమిటి?
4 . ఇశ్రాయేలులను ఏలుచున్న రెహబాము దగ్గరకు జనులు ఎవరిని తీసుకొని వచ్చెను?
5 . నీ తండ్రి ఉంచిన బరువైన కాడిని ఏమి చేయమని యరొబాము,రెహబాముతో మనవి చేసెను?
6. నీవు బరువైన కాడిని చులకన చేసిన, మేము నిన్ను ఏమి చేయుదుమని, యరొబాము రెహబాముతో అనెను?
7 . రెహబాము ఎన్ని దినములు తాళి తర్వాత జనులను రమ్మనెను?
8 . రెహబాము జనుల విషయము ఎవరితో ఆలోచన చేసెను?
9 . పెద్దలు జనుల యెడల ఏమి చూపమని రెహబాముతో అనిరి?
10 . పెద్దల ఆలోచనను రెహబాము ఏమి చేసెను?
11 . రెహబాము తనతో పెరిగిన ఎవరితో ఆలోచన చేసెను?
12. జనులకు వారి కాడిని మరింతగా ఏమి చేయుదునని రెహబాము వారితో అనెను?
13 . నా తండ్రి చుబుకములతో మిమ్మును దండించెను గాని నేను మిమ్మును వేటితో దండించెదనని రెహబాము జనులతో అనెను?
14 . రెహబాము చెప్పిన సమాధానమును వినిన జనులు ఎవరిలో మాకు భాగము లేదనిరి?
15 . యెష్షయి కుమారునిలో మాకు ఏమి లేదని జనులు అనిరి?
Result: