Telugu Bible Quiz Topic wise: 688 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యెఫ్తా" అనే అంశము పై క్విజ్ )

1. "యెఫ్తా ఇశ్రాయేలీయులకు ఎలా యుండెను?
ⓐ రాజుగా
ⓑ ప్రధానునిగా
ⓒ అధిపతిగా
ⓓ న్యాయాధిపతిగా
2. యెఫ్తా తండ్రి పేరేమిటి?
ⓐ ఏలోను
ⓑ గిలాదు
ⓒ యాయిరు
ⓓ దోదో
3. గిలాదునకు యెఫ్తా ఎవరి వలన పుట్టెను?
ⓐ వ్యభిచారి
ⓑ వేశ్య
ⓒ మొదటి భార్య
ⓓ రెండవ భార్య
4. గిలాదు భార్య వలన పుట్టిన కుమారులు, మన తండ్రి ఇంట నీకు ఏమి లేదని యెఫ్తాతో అనిరి?
ⓐ స్వాస్థ్యము
ⓑ హక్కు
ⓒ అధికారము
ⓓ వాటా
5. యెఫ్తా ఏమిగల బలాఢ్యుడు?
ⓐ శూరత్వము
ⓑ గొప్పశక్తి
ⓒ బహుధైర్యము
ⓓ పరాక్రమము
6. "యెఫ్తా" అనగా అర్ధము ఏమిటి?
ⓐ మూసుకొనుట
ⓑ విడిపోవుట
ⓒ తెరువబడుట
ⓓ హత్తుకొనుట
7. ఎవరితో యుద్ధము చేయుటకు గిలాదు పెద్దలు యెప్తాను రమ్మనిరి?
ⓐ ఫిలిష్తీయులతో
ⓑ అమ్మోనీయులతో
ⓒ మోయాబీయులతో
ⓓ దెదానీయులతో
8. ఇశ్రాయేలు పెద్దలు యెఫ్తాతో వారిమీద ఏమి చేయుదుమనిరి?
ⓐ నాయకుడు
ⓑ రాజు
ⓒ అధిపతి
ⓓ న్యాయాధిపతి
9. యెఫ్తా ఎక్కడ యెహోవా సన్నిధిని తన సంగతియంతయు వినిపించెను?
ⓐ యెరెషులో
ⓑ కనానులో
ⓒ మెక్మెషులో
ⓓ మిస్పాలో
10. యెఫ్తా అమ్మోనీయుల రాజుతో ఏమి చేయబూనెను?
ⓐ ఒప్పందము
ⓑ ప్రమాణము
ⓒ సంధి
ⓓ నిబంధన
11. అమ్మోనీయుల రాజు యెఫ్తా మాటలను ఏమి చేయలేదు?
ⓐ అంగీకరించలేదు
ⓑ ఒప్పుకొనలేదు
ⓒ లక్ష్యపెట్టలేదు
ⓓ వినలేదు
12. యెఫ్తా వేశ్య కుమారుడైనను అతడు యెహోవా యందు ఏమి కలవాడు?
ⓐ భయభక్తులు
ⓑ విధేయత
ⓒ విశ్వాసము
ⓓ పైవన్నియు
13. ఎవరు యెఫ్తాకు విరోధముగా లేచినను అతడు వారి మీద జయము పొందెను?
ⓐ బెన్యామీనీయులు
ⓑ ఎఫ్రాయిమీయులు
ⓒ ఎదోమీయులు
ⓓ మోయాబీయులు
14. యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనిన విధముగా ఏమి ఎరుగని తన కుమార్తెను యెహోవాకు మ్రొక్కుబడిగా ఇచ్చెను?
ⓐ పాపము
ⓑ లోకము
ⓒ పురుషుని
ⓓ ఇతర సాంగత్యము
15. యెహోవాకు ఇష్టుడుగా అనుకూలముగా జీవించిన యెఫ్తా ఎన్ని సంవత్సరములు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ యేడు
ⓑ ముప్పది
ⓒ పది
ⓓ ఆరు
Result: