Telugu Bible Quiz Topic wise: 694 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యెహోవా దయపొందుకున్న యోబు" అనే అంశము పై క్విజ్ )

1. యెహోవా దేనిలో నుండి యోబుకు ప్రత్యుత్తరమిచ్చెను?
ⓐ భూకంపములో
ⓑ తుఫానులో
ⓒ సుడిగాలిలో
ⓓ వర్షములో
2. చిత్తగించుము నేను ఎవరినని యోబు యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను?
ⓐ పనికిమాలిన
ⓑ పాపాత్ముడను
ⓒ బుద్ధిహీనుడను
ⓓ నీచుడను
3. యెహోవా యోబునకు వేటిని గూర్చి వివరించెను?
ⓐ భూమి సముద్రములు, హిమము
ⓑ ఆకాశమండలము; నక్షత్రమండలము
ⓒ అడవిజంతువులు పక్షులు
ⓓ పైవన్నిటిని
4. యెహోవా ఉద్దేశించినది ఏదియు ఏమి కానేరదని యోబు అనెను?
ⓐ వ్యర్ధము
ⓑ వృధా
ⓒ నిష్ఫలము
ⓓ పోనేరదు
5. ఏమి లేనివాడనని యోబు యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను?
ⓐ వినయము
ⓑ వివేచన
ⓒ గ్రహింపు
ⓓ వివేకము
6. దేనికి మించిన సంగతులను మాటలాడినానని యోబు యెహోవాతో అనెను?
ⓐ బుధ్ధి
ⓑ ఆలోచన
ⓒ తలంపు
ⓓ వివేకము
7. దేనిచేత యెహోవాను గూర్చిన వార్త వినుచున్నానని యోబు అనెను?
ⓐ దూత
ⓑ ఆలోచన
ⓒ వినికిడి
ⓓ ఇతరుల
8. నన్ను నేను ఏమి చేసుకొనుచున్నానని యోబు అనెను?
ⓐ చీదరించు
ⓑ ఏహ్యపరచు
ⓒ తగ్గించు
ⓓ అసహ్యించు
9. ఎక్కడ కూర్చుని నేను పశ్చాత్తాపపడుచున్నానని యోబు అనెను?
ⓐ ధూళి, బూడిదె
ⓑ నేల, మట్టి
ⓒ గోనెపట్ట, మన్ను
ⓓ దుమ్ము, చెత్త
10. యెహోవా కోపము ఎవరి మీద మండుచుండెను?
ⓐ యోబు
ⓑ యోబు స్నేహితుల
ⓒ యోబుభార్య
ⓓ యోబు బంధువుల
11. స్నేహితుల దేనిని బట్టి శిక్షింపక యెహోవా యోబును ప్రార్ధించమనెను?
ⓐ అవిధేయత
ⓑ అజ్ఞానము
ⓒ అవివేకము
ⓓ అత్యాశ
12. తన సేవకుడైన యోబు మాటలాడినట్లు అతని స్నేహితులు ఎటువంటిది మాట్లాడలేదని యెహోవా అనెను?
ⓐ నిజమైనది
ⓑ యధార్ధమైనది
ⓒ అనుకూలమైనది
ⓓ యుక్తమైనది
13. యోబుకు దేవుడు పూర్వముండిన ఏమి దయచేసెను?
ⓐ ఉన్నతస్థితి
ⓑ క్షేమస్థితి
ⓒ గొప్పస్థితి
ⓓ సంపన్నస్థితి
14. పూర్వము కంటే ఎంత అధికముగా యెహోవా యోబునకు దయచేసెను?
ⓐ మూడంతలు
ⓑ నాలుగంతలు
ⓒ ఐదంతలు
ⓓ రెండంతలు
15. యోబు బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
ⓐ నూట అరువది
ⓑ నూట ముప్పది
ⓒ నూట ఎనుబది
ⓓ నూట నలువది
Result: