1. యెహోవా తన ప్రజలకు దీవెనలు ఏ కొండపై అనుగ్రహించెను?
2. ఇశ్రాయేలీయులు దీవింపబడుట యెహోవా దృష్టికి ఎటువంటిది?
3. ఏమి వినిన దీవెనలు దేవుడు ఇచ్చును?
4. దీవెన వచనములతో పాటు వేటిని కూడా దేవుడు ప్రజలకు తెలియజేసెను?
5. మోషే, అహరోనులు ప్రజలను దీవించిన తర్వాత వారికి ఏమి కనబడెను?
6. దీవెనలు అనుగ్రహింపబడునట్లు యెహోవా మాట ఎలా వినవలెను?
7. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగును?
8. యెహోవా దీవెనలు పొందిన ప్రజలను చూచి ఎవరు భయపడుదురు?
9. యాకోబు, యోసేపునకు ఇచ్చిన దీవెనలు ఎవరివి?
10. యెహోవా దీవెన వలన నీకు సమృద్ధియైన ఏమి కలుగును?
11. ఇశ్రాయేలీయులను దీవించమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
12. నీవు చేయు వేటిలో దీవెన కలుగునని యెహోవా ఆజ్ఞాపించెను?
13. అన్యజనులలో ఏమి తెలియబడునట్లు దేవుడు దీవించును?
14. ఏమివిప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని యెహోవా సెలవిచ్చెను?
15.యెహోవా దీవించిన తర్వాత దానిని ఏమి చేయలేరు?
Result: