1. యోబు తన దుఃఖము ఎలా తూచబడును గాక అనెను?
2. యోబు తన యొక్క ఏమి సంచిలో ముద్రింపబడి యున్నదనెను?
3. కన్యకను చూడనని యోబు తన కన్నులతో ఏమి చేసుకొనెను?
4. తన యొక్క వేటి లెక్క దేవునికి తెలియజేసెదనని యోబు అనెను?
5. దేవుడు నన్ను ఏమి చేసినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానని యోబు అనెను?
6. తన నీతిని విడువక ఎలా పట్టుకొందునని యోబు అనెను?
7. దేవుడు ఎవరని నేను ఆయనను బతిమాలుకొనదగునని యోబు అనెను?
8. దేవుని పెదవుల యొక్క దేనిని నేను విడిచి తిరుగుట లేదని యోబు అనెను?
9. సర్వశక్తుడు చేయు వేటిని దాచిపెట్టనని యోబు అనెను?
10. తన యొక్క ఏమి తనకు వస్త్రమును పాగాయు ఆయెనని యోబు అనెను?
11. ఎక్కడ తన యొక్క ప్రవర్తన న్యాయమని ఋజువు పరతునని యోబు అనెను?
12. దేవుని యందు దృష్టి యుంచి కన్నీళ్ళను ఎలా విడుచుచుంటినని యోబు అనెను?
13. ఏది చీకిపోయిన తరువాత శరీరముతో దేవుని చూచెదనని యోబు అనెను?
14. ఎప్పటి వరకు యధార్ధతను విడువనని యోబు అనెను?
15. దేవుడు తనను శోధించిన తరువాత ఎలా కనబడుదునని యోబు అనెను?
Result: