Telugu Bible Quiz Topic wise: 713 || తెలుగు బైబుల్ క్విజ్ ( "యోషీయా" అనే అంశము పై క్విజ్ )

1. యోషీయా ఏ దేశపు రాజు?
ⓐ యూదా
ⓑ అష్షూరు
ⓒ ఇశ్రాయేలు
ⓓ ఐగుప్తు
2. యోషీయా తండ్రి పేరేమిటి?
ⓐ హిజ్కియా
ⓑ ఆమోను
ⓒ ఉజ్జీయా
ⓓ హోషేయా
3. యోషీయా యేల నారంభించినపుడు ఎన్ని యేండ్ల వాడు?
ⓐ ఏడు
ⓑ ముప్పది
ⓒ ఎనిమిది
ⓓ ఇరువది
4. "యోషీయా" అనగా అర్ధము ఏమిటి?
ⓐ దేవుని విడుదల
ⓑ దేవుని ఏర్పాటు
ⓒ దేవుడు రక్షించినవాడు
ⓓ దేవుడు అప్పగించినవాడు
5. ఆదాయా కుమార్తె అయిన ఎవరు యోషీయా తల్లి?
ⓐ అజూబా
ⓑ యొకల్యా
ⓒ యెదీదా
ⓓ హెఫ్సిబా
6. యోషీయా భార్య పేరేమిటి?
ⓐ దేహీమాను
ⓑ హమూటలు
ⓒ అహీయెపెలు
ⓓ లిబ్నా
7. మోషే ధర్మశాస్త్రము చొప్పున యోషీయా ఎలా చేసెను?
ⓐ పూర్ణ హృదయముతో
ⓑ పూర్ణాత్మతో
ⓒ పూర్ణ బలముతో
ⓓ పైవన్నీ
8. ఎవరు చూపిన ప్రవర్తనకు సరిగా యోషీయా ప్రవర్తించెను?
ⓐ యాకోబు
ⓑ దావీదు
ⓒ సౌలు
ⓓ మోషే
9. యెహోవా సన్నిధిని యోషీయా ఏమి ధరించి కన్నీళ్ళు రాల్చెను?
ⓐ గోనెపట్ట
ⓑ నిలువుటంగీ
ⓒ దీనత్వము
ⓓ మౌనము
10. ఎవరు చేయించిన బలిపీఠములను యోషీయా ఛిన్నాభిన్నములుగా చేయించెను?
ⓐ మనషే
ⓑ యరొబాము
ⓒ ఆమోను
ⓓ అహజ్యా
11. ఏ రాజులు కట్టించిన ఉన్నతస్థలములలో మందిరములను యోషీయా తీయించెను?
ⓐ యూదా
ⓑ ఇశ్రాయేలు
ⓒ అష్షూరు
ⓓ ఐగుప్తు
12. యోషీయా ఏలుబడిలో ఎన్నవ యెహోవాకు పస్కా పండుగ ఆచరింపబడెను?
ⓐ పదవ
ⓑ పదకొండవ
ⓒ పదునెనిమదవ
ⓓ పండ్రెండవ
13. యోషీయా ఎవరికి న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెనని యెహోవా అనెను?
ⓐ దీనులకు; దరిద్రులకు
ⓑ పెద్దలకు
ⓒ వృద్ధులకు
ⓓ దౌర్భాగ్యులకు
14. వేటిని అనుసరించి యోషీయా క్షేమముగా నుండెనని యెహోవా అనెను?
ⓐ ధర్మమును
ⓑ నీతిన్యాయమును
ⓒ కట్టడలను
ⓓ ఆజ్ఞలను
15. ఐగుప్తు రాజైన ఎవరు యోషీయాను చంపెను?
ⓐ నెకేలీను
ⓑ హెర్మోనీను
ⓒ షెరామీను
ⓓ ఫరోనెకో
Result: