1Q. ప్రాణమును భూమి మీద ఎలా పారబోయవలెను?
2. నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుమని ఎవరి గురించి దావీదు సొలొమోనుకు చెప్పెను?
3 ప్ర. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని ఎవరు జనులకు చెప్పెను?
4. యాజకులు ఎవరి చేతిలో నుండి రక్తమును తీసుకొని యెహోవా మందిరములో ప్రోక్షించిరి?
5 ప్ర. ఎవరు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించునని సొలొమోను అనెను?
6Q. నాతో ఉండని జనములను దేని చేత అణగద్రొక్కుట వలన వారి రక్తము నా వస్త్రముల మీద చిందినదని యెహోవా అనెను?
7ప్ర. నిరపరాధుల రక్తము బహుగా ఒలికించినదెవరు?
8 ప్ర. దేనితో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదని పౌలు అనెను?
9 ప్ర. క్రీస్తుయేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను దేవుడు ఎలా బయలుపరచెను?
10 ప్ర. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారికి గొంతుపిసికి చంపినదాని రక్తమును విసర్జించుటకు పత్రిక పంపవలెనను తన అభిప్రాయము చెప్పినదెవరు?
11 Q.మనము దీవించు ఏ పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా?
12.క్రీస్తు నందు ఏమి నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత దేవుడు సంధిచేసెను?
13Q. క్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారే దేనిలో ప్రవేశించెను?
14ప్ర. క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆయన ద్వారా దేనినుండి రక్షింపబడుదురు?
15 ప్ర. యేసు పట్టుకొనిన పాత్ర ఆయన రక్తము వలన ఏమియై యున్నది?
Result: