Telugu Bible Quiz Topic wise: 718 || తెలుగు బైబుల్ క్విజ్ ( "రక్షణ" అనే అంశముపై క్విజ్-2 )

1. Salvation అనగా అర్ధము ఏమిటి?
Ⓐ రక్షణ
Ⓑ మోక్షము
Ⓒ అభయము
Ⓓ పైవన్నీ
2. నేనే నీ "రక్షణ"అని నాతో సెలవిమ్ము అని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ దావీదు
Ⓒ యెషయా
Ⓓ ఆసాపు
3. యెహోవాయే నా "రక్షణ"కర్త అని నేను ఆయనను స్తుతించెదనని ఎవరు అనెను?
Ⓐ కోరహుకుమారులు
Ⓑ యోవేలు
Ⓒ ఆసాపు
Ⓓ నాతాను
4. స్తుతియాగము అర్పించువాడు దేవుని "రక్షణ"కనుపరచునట్లు ఏమి సిద్ధపరచుకొనెను?
Ⓐ అర్పణ
Ⓑ ప్రార్ధన
Ⓒ మార్గము
Ⓓ ప్రభావము
5. నీ "రక్షణ" యొక్క దేనిని బట్టి నాకుత్తరమిమ్ము అని దావీదు యెహోవాతో అనెను?
Ⓐ న్యాయము
Ⓑ సత్యము
Ⓒ ధర్మము
Ⓓ వాత్సల్యము
6. నీ "రక్షణ"నన్ను ఏమి చేయును గాక అని దావీదు దేవునితో అనెను?
Ⓐ ఆదరించును
Ⓑ కాపాడును
Ⓒ నడిపించును
Ⓓ ఉద్ధరించును
7. మా "రక్షణ"కర్తవగు దేవా, నీ నామప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము అని ఎవరు దేవునితో అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ నాతాను
Ⓒ సొలొమోను
Ⓓ ఏతాను
8. మేము "రక్షణ"నొందునట్లు నీయొక్క దేనిని ప్రకాశింపజేయుమని ఆసాపు అనెను?
Ⓐ వెలుగును
Ⓑ ముఖకాంతి
Ⓒ వితానము
Ⓓ తేజము
9. యెహోవా "రక్షణ"ఆయనకు భయపడువారికి ఎలా యున్నది?
Ⓐ ఆనందకరముగా
Ⓑ ఆదరణకరముగా
Ⓒ సమీపముగా
Ⓓ ఉన్నతముగా
10. భూమి ఏమి విడిచి "రక్షణ"ఫలించునట్లు అది నీతిని మొలిపించును?
Ⓐ పొరలు
Ⓑ నెరలు
Ⓒ పెళ్లలు
Ⓓ గడ్డలు
11. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉన్నది, ఆయన వలన నాకు "రక్షణ"కలుగునని దావీదు అనెను?
Ⓐ గంభీరముగా
Ⓑ ఉదారముగా
Ⓒ మౌనముగా
Ⓓ నెమ్మదిగా
12. దేనిలోని యాజకులకు యెహోవా "రక్షణను" వస్త్రముగా ధరింపజేసెదననెను?
Ⓐ సీయోను
Ⓑ షిలోహు
Ⓒ ఎఫ్రాత
Ⓓ యయీరు
13. నా "రక్షణ"ఏమి చేయలేదు అని యెహోవా అనెను?
Ⓐ నిర్లక్ష్యము
Ⓑ అలక్ష్యము
Ⓒ ఆలస్యము
Ⓓ అలసత్వము
14. నేను కలుగజేయు "రక్షణ"బయలుదేరునప్పుడు నా యొక్క ఏమి జనములకు తీర్పు తీర్చునని యెహోవా అనెను?
Ⓐ దూతలు
Ⓑ బాహువులు
Ⓒ సైన్యములు
Ⓓ సంఘములు
15. నా "రక్షణ"వచ్చుటకు సిద్ధముగా ఉన్నది గనుక వేటిని అనుసరించుమని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ చారమును ; ఆజ్ఞను
Ⓑ పదేశమును : శాసనమును
Ⓒ కట్టడను ; సత్యమును
Ⓓ న్యాయవిధిని; నీతిని
Result: