Telugu Bible Quiz Topic wise: 721 || తెలుగు బైబుల్ క్విజ్ ( "రాకడకు సూచనలు"అనే అంశముపై క్విజ్ )

1Q. రాకడకు యుగసమాప్తి సూచనలు తెలుపమని ఎవరు యేసును అడిగెను?
A శాస్త్రులు
B పరిసయ్యులు
C జనులు
D శిష్యులు
2Q. జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము కరవులు భూకంపములు వేటికి ప్రారంభము?
A వేదనలకు
B శోధనలకు
C రోదనలకు
D భయములకు
3 Q. ఆకాశము నుండి ఎటువంటి సూచనలు కనబడును?
A అగ్ని ప్రవాహము
B మెరుపుల తాకిడి
C మహాభయోత్పాతములు
D భయంకరపడుగులు
4Q.ఏ ప్రవక్త చెప్పిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట చూతుము?
A దావీదు
B దానియేలు
C యెషయా
D యెహెజ్కేలు
5. దేని మీదికి మిక్కిలి యిబ్బంది వచ్చును?
A ఇంటి
B జనము
C పొలము
D భూమి
6Q. ఎవరు అనేకులుగా వచ్చి పలువురిని మోసపరచెదరు?
A దోపిడిదారులు
B అబధ్ధప్రవక్తలు
C ద్రోహసమూహము
D చోరగ్రాహకులు
7Q. అన్యజనుల కాలములు ఏమగు వరకు యెరూషలేము వారి చేత త్రొక్కబడును?
A వితరణము
B వినియోగము
C సంపూర్ణము
D సాధికారము
8Q. రాకడ దినములలో ఎవరెవరికి శ్రమ?
A వేశ్యలకు; జారులకు
B పెద్దలకు, వృద్ధులకు
C బీదలకుపేదలకు
D గర్భిణులకు; పాలిచ్చువారికి
9Q. అక్రమము ఏమి అవుట చేత అనేకుల ప్రేమ చల్లారును?
A వ్యాపించుట
B విస్తరించుట
C అధికము
D వెదజల్లుట
10 Q. ఎక్కడి శక్తులు కదిలింపబడును?
A వాయుమండలము
B భూమండలము
C ఆకాశమందలి
D ఆవరణమండలము
11: అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు ఏమి చేసి ఏర్పర్చబడిన వారిని సహితము మోసపరచ చూచెదరు?
A వింతైనకార్యములు
B విచిత్రమైనపనులు
C భ్రమపరచువేడుకలు
D సూచకక్రియలు;మహాత్కార్యములు
12Q. యుద్ధములు కలహముల గూర్చి వినినప్పుడు ఏమి అవ్వవద్దని యేసు చెప్పెను?
A జడియకుడి
B కలవరపడకుడి
C భీతిల్లకుడి
D పారిపోకుడి
13 Q. ఎవరి కొరకు ఆ దినములు తక్కువ చేయబడును?
A పరిశుధ్ధుల
B బోధకుల
C ఏర్పర్చబడినవారి
D జనముల
14. మెరుపు ఎక్కడ పుట్టి ఎక్కడ వరకు కనబడునో అలాగే మనుష్యకుమారుని రాకడ నుండునని యేసు చెప్పెను?
A తూర్పు, పడమర
B ఉత్తర; దక్షిణ
C పశ్చిమ ; వాయువ్య
D ఈశాన్య; నైరుతి
15Q. దేని చేత మన ప్రాణమును దక్కించుకొందుమని యేసు చెప్పెను?
A ఆస్తి
B వెండి
C బంగారము
D ఓర్పు
Result: