① రాహాబు ఏ పట్టణమునకు చెందిన స్త్రీ?
2 రాహాబు అనగా హెబ్రీ భాషలో అర్ధము ఏమిటి?
③ ఎవరు పంపిన వేగుల వారిని రాహాబు దాచిపెట్టెను?
④ రాహాబు అనగా గ్రీకు భాషలో అర్థము ఏమిటి?
⑤ రాహాబు ఎవరై యుండెను?
⑥ దేవుడైన యెహోవా గురించి రాహాబు వేగులవారిగా వచ్చిన ఎంతమందితో మాట్లాడెను?
⑦ దేనిని బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనెను?
⑧ వేగుల వారిని చేర్చుకొనినందున ఎవరితో పాటు రాహాబు నశింపకపోయెను?
⑨ రాహాబను వేశ్య దూతలను చేర్చుకొనినందున క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడెనని ఎవరు అనెను?
①⓪. యెరికో వారితో చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా వేగుల వారితో ఎవరి తోడని ప్రమాణము చేయుమని రాహాబు అనెను?
①① యెహోవా దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా నీకు మేము ఏమి చేసెదమని వేగుల వారు రాహాబుతో అనిరి?
①② రాహాబు ఎవరి మధ్య నివసించుచుండెను?
①③ ఇశ్రాయేలీయులలో ఎవరు రాహాబును పెండ్లి చేసుకొనెను?
①④ రాహాబు యొక్క కుమారుని పేరు ఏమిటి?
①⑤ రాహాబు కిటికీకి కట్టిన ఏ దారము క్రీస్తు రక్తముకు సాదృశ్యము?
Result: