1. నేను నిన్ను ఆశీర్వదించునట్లు "రుచి"గల భోజ్యములను సిద్ధపరచమని ఇస్సాకు ఎవరితో చెప్పెను?
2. మన్నా యొక్క "రుచి"ఏమి కలిపిన అపూపముల వలె నుండెను?
3. క్రీస్తు ద్రాక్షారసముగా మార్చిన నీటిని "రుచి"చూచినదెవరు?
4. మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, "రుచి చూడవద్దు" అను దేనికి లోబడకూడదు?
5. గ్రుడ్డులోని దేనిలో "రుచి"యుండదని యోబు అనెను?
6. యెహోవా ఎవరని "రుచి"చూచి తెలుసుకొనవలెను?
7. పరలోకసంబంధమైన దేనిని "రుచి" చూచి తప్పిపోయినవారు దేవుని కుమారుని మరల సిలువ వేసియున్నారు?
8. ఎదుటివాని ఏమి ఓర్చలేనివాని యొక్క "రుచి"గల పదార్ధములను ఆశింపకూడదు?
9. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు వరకు ఏమి "రుచి"చూడరని యేసు చెప్పెను?
10. ఏమియైన మనుష్యులలో ఒకడును నా విందు "రుచి"చూడడని విందును ఇచ్చు అతను అనెను?
11. సూర్యుడు అస్తమింపక మునుపు నేను ఆహారమును "రుచి" చూచిన యెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాక అని ఎవరు అనెను?
12. ఎంతమంది యూదులు పౌలును చంపువరకు ఏమియు "రుచి"చూడమని అనిరి?
13. మన సంభాషణ ఉప్పు వేసినట్టు "రుచి" గలదిగాను మరియు ఇంకా ఎలా యుండవలెను?
14. ఒకడు యేసు మాటను ఏమి చేసిన యెడల వాడు మరణమును "రుచి" చూడడు?
15. ప్రభువు దయాళుడని "రుచి"చూచిన యెడల వేటిని మానుకొన వలెను?
Result: