1. శరీరమును కృశింప జేసి, చావునకు గురిచేసే రుగ్మతలను ఏమంటారు?
2. యెహోవా "సర్వరోగములను"మన యొద్ద నుండి ఏమి చేయును?
3. రోగ శయ్య మీద ఉన్నప్పుడు యెహోవా ఏమి చేయును?
4. ఎవరికి మరణకరమైన రోగము కలిగినపుడు యెహోవా అతనిని స్వస్థపరచెను?
5. యెహోవాను ఆశ్రయించినపుడు ఎప్పుడు పాడుచేయు రోగమునకు భయపడకుందువు?
6. కుదరని రోగము సంభవించినను, నశించిపోకుండా యెహోవా ఎవరిని రక్షించెను?
7. యెహోవా ఎవరి మధ్య నుండి రోగమును తొలగించెదననెను?
8. సంకటము (రోగము)లన్నియు యెహోవా ఏమి చేయును?
9. యేసు ప్రేమించిన ఎవరు రోగియై మరణించిన అతనిని తిరిగి క్రీస్తు బ్రదికించెను?
10. యెహోవా రోగమును ఏమి చేయును?
11. ఎవరు నిజముగా రోగియై చావునకు సిద్ధమై యున్నప్పుడు దేవుడు అతనిని కనికరించెను?
12. క్రీస్తు ఎక్కడికి వచ్చినపుడు జనులు చుట్టూ నున్న రోగులను స్వస్థత కొరకు ఆయన యొద్దకు పంపిరి?
13. మన రోగములను క్రీస్తు ఎలా భరించెను?
14. ఎటువంటి ప్రార్ధన రోగిని స్వస్థపరచును?
15. యేసు దేని గురించి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచెను?
Result: