Telugu Bible Quiz Topic wise: 740 || తెలుగు బైబుల్ క్విజ్ ( "లేఖకులు" అనే అంశముపై క్విజ్ )

1. SCRIBES అనగా అర్ధము ఏమిటి?
ⓐ లేఖికుడు(లేఖరి)
ⓑ శాస్త్రులు
ⓒ దస్తావేజుల అధికారి
ⓓ పైవన్నియు
2. "లేఖికుని " యొక్క పని ఏమిటి?
ⓐ ప్రతులు వ్రాయుట
ⓑ పాతవి పునరుద్దరించుట
ⓒ ప్రతులు భద్రపరచుట
ⓓ పైవన్నియు
3. దావీదు రాజైనపుడు ఎవరు అతని దగ్గర "లేఖికుడుగా"నుండెను?
ⓐ బెనాయా
ⓑ ఈరా
ⓒ షమ్మయి
ⓓ షెనా
4. దావీదు దగ్గర యున్న మరో "లేఖికుని"పేరేమిటి?
ⓐ యోవాబు
ⓑ శెరాయా
ⓒ షెమాయా
ⓓ బెనాయా
5. సొలొమోను యొద్ద నున్న "లేఖికుడు"ఎవరు?
ⓐ యెహోషాపాతు
ⓑ ఆజర్యా
ⓒ అహీయాము
ⓓ అహీషారు
6. ఎవరి రాజదేహసంరక్షకుల అధిపతి యూదా దేశపు జనుల సంఖ్య చేయువారి అధిపతి యొక్క "లేఖికుని"పట్టుకొనెను?
ⓐ సన్హెరీబు
ⓑ నెబుకద్నెజరు
ⓒ మేషా
ⓓ ఫరో
7. కేనీయుల సంబంధులైన "లేఖికుల"వంశములేవి?
ⓐ తిరాతీయులు
ⓑ షిమ్యాతీయులు
ⓒ కూకోతీయులు
ⓓ పైవారందరు
8."లేఖికుల" వంశములు ఎక్కడ కాపురముండెను?
ⓐ తెకోవలో
ⓑ యాయీరులో
ⓒ యబ్బేజులో
ⓓ హూరులో
9. అవిసెనార బట్ట కట్టుకొని నడుముకు "లేఖికుని "సిరాబుడ్డి కట్టుకొనియున్న ఒకడు ఎవరికి కనిపించెను?
ⓐ యెషయాకు
ⓑ యెహెజ్కేలుకు
ⓒ జెకర్యాకు
ⓓ ఆమోసుకు
10. యూదా దేశము యొక్క ఎవరి "లేఖరిని" నెబూజరదాను బబులోనుకు తీసికొనిపోయెను?
ⓐ సైన్యాధిపతి
ⓑ న్యాయాధిపతి
ⓒ వస్త్రశాలఅధిపతి
ⓓ ఆయుధశాల అధిపతి
11. "లేఖికుడగు"ఎవరు నేరీయా కుమారుడు?
ⓐ షెలెమ్యా
ⓑ బారూకు
ⓒ జెఫన్యా
ⓓ మీకాయా
12. యెహోవా ఎవరితో చెప్పిన మాటలను 'లేఖికుడైన "బారూకు పుస్తకములో వ్రాసెను?
ⓐ యెషయా
ⓑ యోషీయా
ⓒ యిర్మీయా
ⓓ యెహెజ్కేలు
13. బారూకు "లేఖికుడైన"ఎవరి గదికి పైనున్న శాలలో యిర్మీయా చెప్పిన మాటలను చదివి వినిపించెను?
ⓐ షెమాయా
ⓑ గెమర్యా
ⓒ శెరాయా
ⓓ దెలాయ్యా
14. యిర్మీయా చెప్పిన మాటలు వ్రాసిన పుస్తకమును "లేఖికుడైన"ఎవరి గదిలో దాచిపెట్టిరి?
ⓐ అక్బోరు
ⓑ మీకాయా
ⓒ ఎలీషామా
ⓓ ఎలీక్షాను
15. యిర్మీయాను పట్టుకొని కొట్టి అతనిని "లేఖికుడైన"ఎవరి ఇంటిలో వేయించిరి?
ⓐ హనన్యా
ⓑ గెమర్యా
ⓒ ఆజర్యా
ⓓ యోనాతాను
Result: