Telugu Bible Quiz Topic wise: 741 || తెలుగు బైబుల్ క్విజ్ ( "లేచి" అనే అంశముపై క్విజ్ )

1: ఎవరు అరుణోదయమున "లేచి" తన కుమారుల నిమిత్తము నిత్యము దహనబలి అర్పించును?
A యోనా
B యాకోబు
C యోబు
D యోసేపు
2. వేకువనే "లేచి" గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి దేనిగా ఎంచబడును?
A దీవెనగా
B శాపముగా
C ఘనతగా
D ప్రియముగా
3Q. గుణవతియైన భార్య చీకటితోనే "లేచి", తన యింటివారికొరకు దేనిని సిద్ధపరచును?
A భోజనమును
B బతేమును
C లాభమును
D ద్రవ్యమును
4 Q. నీవు "లేచి", శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుమని ప్రభువు దూత ఎవరికి చెప్పెను?
A యోసేపునకు
B యాకోబునకు
C పేతురునకు
D యోహానుకు
5 Q. నీవు" లేచి" ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని సౌలుతో ఎవరు చెప్పెను?
A బర్సభ
B అననీయ
C అపేతురు
D నీకొదేము
6Q. నీవు "లేచి" మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
A యిర్మీయా
B దానియేలు
C దావీదు
D యెహెజ్కేలు
7Q. యేసు పెందలకడనే "లేచి" యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, ఎక్కడికి వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను?
A సమాజమందిరమునకు
B అరణ్య ప్రదేశమునకు
C దూరప్రాంతమునకు
D ఇతర పట్టణమునకు
8 Q. యెహోవా - నీవు "లేచి" నీ దేశమునుండియు, నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుమని ఎవరితో చెప్పెను?
A ఇస్సాకుతో
B యాకోబుతో
C అబ్రాహాముతో
D యోసేపుతో
9 Q. ఎవరు పెందలకడ "లేచి", పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను?
A రాజైన ఆహాబు
B రాజైన అమోను
C రాజైన హిజ్కియా
D రాజైన దావీదు
10 Q. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలందరు "లేచి" వేటిని చక్కపరచుకొనిరి?
A తమ పెండ్లివిందులను
B తమ దివిటీలను
C తమ అభరణములను
D తమ వస్త్రములను
11: షియొను కుమారి నీవు "లేచి" రేయి ఏ జామున మొఱ్ఱపెట్టుము?
A మూడవ జామున
B నాల్గవ జామున
C మొదటి జామున
D రెండవ జామున
12. యెహోవా నేను పెందలకడ "లేచి" మీతో ఏవిధముగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు?
A బహుతేటగా
B బహుశ్రద్ధగా
c బహు ప్రేమగా
D బహుఆశగా
13 . ఏ తెగవారు "లేచి" అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి?
A పరిసయ్యుల
B సుంకరుల
C సద్దూకయ్యుల
D శాస్త్రుల
14Q. యేసు "లేచి" వేటిని గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను?
A భూమ్యాకాశములను
B దట్టపు మేఘములను
C నీటిమబ్బులగుంపులను
D గాలిని సముద్రమును
15Q. శోధనలో ప్రవేశించకుండునట్లు "లేచి" ఏమి చేయవలెను?
A ప్రార్ధన
B అల్లరి
C వ్యాపారము
D గానము
Result: