①. పెద్దలు ప్రధానయాజకులు శాస్త్రుల చేతను యేసు ఏమి పొంది మూడవ దినమున "లేచుట"అగత్యము?
②. ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన "లేచి"యున్నాడని యేసును గూర్చి ఎవరు మగ్దలేనే మరియ వేరొక మరియతో చెప్పెను?
③. ఎప్పుడు తెల్లవారినప్పుడు యేసు "లేచి" తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను?
④. జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి "లేపెనని"ఎవరు యూదులతో అనెను?
⑤. మృతులలో నుండి "లేచిన" క్రీస్తుయేసు దేవుని కుడిపార్శ్వమున ఉండి మనకొరకు ఏమి చేయుచుండెను?
⑥. ప్రభువును "లేపిన "దేవుడు తన యొక్క దేని వలన మనలను కూడా లేపును?
⑦. మృతులలో నుండి "లేచిన "క్రీస్తు మీద దేనికి ప్రభుత్వము లేదని ఎరుగుదుము?
⑧. దేవుడు మృతులలో నుండి క్రీస్తును "లేపెనని" ఎక్కడ విశ్వసించిన యెడల రక్షింపబడుదురు?
⑨. యేసు మృతి పొంది తిరిగి "లేచెనని"మనము నమ్మిన యెడల, యేసు నందు ఏమైన వారిని ఆయన వెంటపెట్టుకొని వచ్చును?
①⓪. నిద్రించిన వారిలో ఎలా క్రీస్తు మృతులలో నుండి "లేపబడి"యున్నాడు?
①①. తమ నిమిత్తం మృతిపొంది తిరిగి "లేచిన"వాని కొరకే జీవించుటకు యేసు అందరి కొరకు మృతిపొందెననియు ఏమి చేసుకొనుచున్నాము?
①②. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి "లేచుట" వలన జీవముతో కూడిన ఏమి మనకు కలుగుచున్నది?
①③. కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివానిని ఆయన ఎప్పుడు "లేపెద"ననెను?
①④. మన ప్రభువును దేని సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి "లేపిన" సమాధానకర్తయగు దేవుడు తన చిత్తమందు సిద్ధపరచును?
①⑤. దేని ప్రకారము క్రీస్తు మూడవదినమున "లేపబడెను"?
Result: